షేర్, ప్రతాని రామకృష్ణ గౌడ్, అట్లూరి రామకృష్ణ
కరోనా వైరస్ వల్ల నెలకొన్న లాక్‌డౌన్ నేపథ్యంలో ‘లాక్‌డౌన్’ అనే చిత్రం రూపొందింది. ఉమాంతకల్ప, ఆశిరోయ్, హృతికా సింగ్, రాకింగ్ రాకేష్, అపూర్వ ముఖ్య పాత్రల్లో బాబా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. షేర్ సమర్పణలో మౌంట్ ఎవరెస్ట్ పిక్చర్స్ పతాకంపై మిన్నీ నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ని నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్, అట్లూరి రామకృష్ణ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘లాక్‌డౌన్’ సినిమాని అనుకున్న బడ్జెట్‌లో టైమ్‌కి పూర్తి చేయడం విశేషం.
టీజర్ ఆసక్తిగా ఉంది. సినిమా సక్సెస్ అయ్యి యూనిట్ అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాం’’ అన్నారు. సమర్పకుడు షేర్ మాట్లాడుతూ–‘‘లాక్‌డౌన్ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని ప్రేక్షకులకు నవ్వులు పంచేలా ఈ సినిమాను తెరకెక్కించాం. అమ్మాయిలకు మా చిత్రం ఒక ధైర్యం ఇస్తుంది. ఒక మంచి సందేశంతో పాటు వినోదం ఉంటుంది. కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రమిది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్ కిషోర్, సంగీతం, స్టోరీ, స్క్రీన్ ప్లే: షేర్.
Comments
Please login to add a commentAdd a comment