ఊతకొట్టుడు కొట్టేశాడు! | Sakshi
Sakshi News home page

ఊతకొట్టుడు కొట్టేశాడు!

Published Mon, Dec 18 2023 1:09 AM

Nagarjuna: Na Sami Ranga Teaser release - Sakshi

‘ఏం చేస్తాన్నాడెంటి.. మీవోడు.. ’ (ఆషికా రంగనాథ్‌), ‘నిన్నే మావిడితోటలో ఇరవైమందిని ఊతకొట్టుడు కొట్టేశాడు (‘అల్లరి’ నరేశ్‌)’, ‘ఆడేమైనా కుర్రాడనుకుంటున్నాడా..కొంచెం తగ్గమను (ఆషికా)’...అన్న డైలాగ్స్‌తో విడుదలైంది ‘నా సామిరంగ’ సినిమా టీజర్‌. నాగార్జున హీరోగా, ‘అల్లరి’ నరేశ్, రాజ్‌ తరుణ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నా సామిరంగ’. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్నిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, పవన్‌కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘నా సామిరంగ’ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను ఆదివారం విడుదల చేశారు మేకర్స్‌. ‘ఏం అడగాలో దానికి తెలియదు. ఏం అడుగుతుందో నీకు తెలియదు. ఏం చేయాలో నాకు తెలియదు’ (నాగార్జున)    అన్న డైలాగ్స్‌తో ఈ టీజర్‌ సాగుతుంది. ‘‘సినిమాలో నాగార్జునగారి గోదావరి యాస చాలా బాగుంటుంది. రొమాన్స్, స్నేహం, యాక్షన్‌ అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: కీరవాణి.

Advertisement
 
Advertisement
 
Advertisement