పృథ్వీ అంబర్, సుమయా రెడ్డి జంటగా నటిస్తున్న చిత్రం ‘డియర్ ఉమ’. సాయి రాజేశ్ మహాదేవ్ దర్శకత్వంలో సుమయా రెడ్డి నిర్మించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘నా కణాల్లో జీవం నీ కళ్లు.. నా నరాల్లో ప్రవాహాం నీ చూపు’, ‘ప్రేమ అనేది ఓ అనిర్వచనీయమైన నిర్వచనం’, ‘అబ్బాయిల ప్రేమలో స్వార్థం ఉండదు.. అమ్మాయిల స్వార్థంలోనే ప్రేమ ఉంటుంది.. అమ్మాయిలు ఇచ్చే షాక్‌లకు.. అబ్బాయిలకు ఇదే సరైన మెడిసిన్’ అనే డైలాగ్స్ టీజర్‌లో ఉన్నాయి.
అందమైన ప్రేమ కథా చిత్రంగా డియర్ ఉమ రాబోతోందని టీజర్‌తో స్పష్టమైంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి సంగీతం: రథన్, కెమెరా: రాజ్ తోట.
Comments
Please login to add a commentAdd a comment