Matarani Mounamidi Movie First Glimpse Out, Check Inside - Sakshi
Sakshi News home page

Matarani Mounamidi Movie: ‘మాటరాని మౌనమిది’గ్లింప్స్‌ టీజర్‌ విడుదల

Published Fri, Apr 15 2022 12:43 PM | Last Updated on Fri, Apr 15 2022 1:28 PM

Matarani Mounamidi Movie First Glimpse Out - Sakshi

‘శుక్ర’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు సుకు పూర్వాజ్‌ తాజాగా మరో చిత్రానికి శ్రీకారం చుట్టాడు. రుద్ర పిక్చర్స్ పతాకంపై మహేష్ దత్తా, సోని శ్రీవాస్తవ, శ్రీహరి ఉదయగిరి హీరో హీరోయిన్లుగా ‘మాటరాని మౌనమిది’చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనిలో నిమగ్నమై ఉంది. తాజాగా ఈచిత్రం గ్లింప్స్‌ టీజర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్‌.

ఈ సందర్భంగా దర్శకుడు సుకు పూర్వాజ్‌ మాట్లాడుతూ..‘నా మొదటి సినిమా శుక్ర, మంచి విజయం సాధించింది. అమెజాన్ ప్రైమ్ లో 2.2 మిలియన్ మంది వీక్షించారు. ఇప్పుడు ‘మాటరాని మౌనమిది’ అనే మంచి థ్రిల్లర్ ప్రేమ కథ తో మీ ముందుకు వస్తున్నాను. మంచి కథ, కథనం తో  మీ ముందుకు వస్తున్నాను. త్వరలోనే విడుదల తేదిని ప్రకటిస్తాం’అన్నారు. ఈ చిత్రానికి ఈ చిత్రానికి అషీర్ లుక్ సంగీతం సమకూరుస్తుండగా, శివరామ్ చరణ్  కెమెరా మెన్‌గా వ్యవహరిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement