తండ్రి, తనయుల మధ్య సంఘటనలే 'లోకం ఎరుగని కథ'.. టీజర్ రిలీజ్ | Surendra Kumar Lokam Yerugani Katha Movie Official Teaser Out | Sakshi
Sakshi News home page

Lokam Yerugani Katha Teaser: విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో వస్తున్న 'లోకం ఎరుగని కథ'.. ఆసక్తిగా టీజర్

Sep 30 2022 9:21 PM | Updated on Sep 30 2022 9:23 PM

Surendra Kumar Lokam Yerugani Katha Movie Official Teaser Out  - Sakshi

సురేంద్ర కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'లోకం ఎరుగని కథ'. ఈ సినిమా ద్వారా  పూజిత హీరోయిన్‌గా పరిచయమవుతోంది. తాజాగా చిత్రయూనిట్ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర టీజర్‌ను విడుదల చేసింది. రవి కాంత్ జమి నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. శ్రీమతి సుజాత సమర్పణలో క్రియేటివ్ డైరెక్టర్స్ క్లబ్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

చిత్ర దర్శకుడు సురేంద్ర కుమార్ మాట్లాడుతూ..'ఈ సినిమా విషయానికి వస్తే ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో జరిగే లవ్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ స్టోరీ. పాతకాలపు ఆచారాలతో ఉన్న తండ్రి, ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టు ఉండే కుమారుడి మధ్య జరిగే అంశమే 'లోకం ఎరుగని కథ'. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీకాంత్ కొప్పుల మాట్లాడుతూ..'ఇంతకుముందు నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్ చూసి నన్ను సంగీత దర్శకునిగా ఎంపిక చేశారు. అందరికీ ఈ సినిమాలోని పాటలు అందరికీ నచ్చుతాయి. నాకు ఈ అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు' అని అన్నారు.

నటుడు విజయ్ విశ్వనాధన్ మాట్లాడుతూ.. 'తమిళంలో కొన్ని సినిమాలు చేశాను. మంచి కంటెంట్ ఉన్న తెలుగు సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది'అని అన్నారు. హీరోయిన్ పూజిత మాట్లాడుతూ..'ఇది నా మొదటి చిత్రం. మా టీం అందరూ చాలా హార్డ్ వర్క్ చేశాం. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు చాలా థ్యాంక్స్' అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement