Surendra Kumar
-
తండ్రి, తనయుల మధ్య సంఘటనలే 'లోకం ఎరుగని కథ'.. టీజర్ రిలీజ్
సురేంద్ర కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'లోకం ఎరుగని కథ'. ఈ సినిమా ద్వారా పూజిత హీరోయిన్గా పరిచయమవుతోంది. తాజాగా చిత్రయూనిట్ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర టీజర్‌ను విడుదల చేసింది. రవి కాంత్ జమి నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. శ్రీమతి సుజాత సమర్పణలో క్రియేటివ్ డైరెక్టర్స్ క్లబ్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్ర దర్శకుడు సురేంద్ర కుమార్ మాట్లాడుతూ..'ఈ సినిమా విషయానికి వస్తే ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్లో జరిగే లవ్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ స్టోరీ. పాతకాలపు ఆచారాలతో ఉన్న తండ్రి, ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టు ఉండే కుమారుడి మధ్య జరిగే అంశమే 'లోకం ఎరుగని కథ'. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీకాంత్ కొప్పుల మాట్లాడుతూ..'ఇంతకుముందు నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్ చూసి నన్ను సంగీత దర్శకునిగా ఎంపిక చేశారు. అందరికీ ఈ సినిమాలోని పాటలు అందరికీ నచ్చుతాయి. నాకు ఈ అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు' అని అన్నారు. నటుడు విజయ్ విశ్వనాధన్ మాట్లాడుతూ.. 'తమిళంలో కొన్ని సినిమాలు చేశాను. మంచి కంటెంట్ ఉన్న తెలుగు సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది'అని అన్నారు. హీరోయిన్ పూజిత మాట్లాడుతూ..'ఇది నా మొదటి చిత్రం. మా టీం అందరూ చాలా హార్డ్ వర్క్ చేశాం. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు చాలా థ్యాంక్స్' అని అన్నారు. -
జడ్జి యాదవ్ చివరి తీర్పు
అయోధ్య: మూడు దశాబ్దాలుగా తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్న బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పు వెల్లడించిన సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి సురేంద్ర కుమార్ యాదవ్‌కి ఇదే ఆఖరి తీర్పు. ఆయన తన కెరీర్లో మొట్టమొదటి సారిగా ఫైజాబాద్ జిల్లా (ఇప్పుడు అయోధ్య జిల్లాగా పేరు మార్చారు) అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అదే అయోధ్యకు సంబంధించిన అత్యంత కీలకమైన తీర్పునిచ్చి ఇప్పుడు పదవీ విరమణ చేస్తున్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఏర్పాటైన లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ప్రిసైడింగ్ అధికారిగా ఎస్కే యాదవ్ అయిదేళ్ల క్రితం 2015, ఆగస్టు 5న నియమితులయ్యారు. అప్పట్నుంచి ఆయన ఆధ్వర్యంలోనే కేసు విచారణ నడుస్తోంది. ఏళ్లకి ఏళ్లు విచారణ గడుస్తూ ఉండడంతో ప్రతీ రోజూ విచారణ జరిపి, రెండేళ్లలో తీర్పు చెప్పాలంటూ 2017 ఏప్రిల్ 19న సుప్రీం కోర్టు ప్రత్యేక కోర్టుని ఆదేశించింది. అప్పట్నుంచి ఎస్కే యాదవ్ ప్రతీ రోజూ కేసుని విచారించారు. ఏడాది కిందటే పదవీ విరమణ కానీ.. ఉత్తరప్రదేశ్‌లోని జాన్పూర్ జిల్లా పఖాన్పూర్ గ్రామానికి చెందిన సురేంద్ర కుమార్ 31 ఏళ్ల వయసులో జ్యుడీషియల్ సర్వీసెస్‌లోకి వచ్చారు. ఫైజాబాద్ మున్సిఫ్ కోర్టులోకి అడుగు పెట్టి జిల్లా జడ్జి వరకు ఎదిగి సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. గత ఏడాదే న్యాయమూర్తిగా ఆయన పదవీ విరమణ చేశారు. లక్నో బార్ కౌన్సిల్ ఆయనకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం కూడా చేసింది. అయితే అయిదేళ్లుగా కేసు విచారిస్తూ ఉండడంతో సుప్రీం కోర్టు ప్రత్యేక న్యాయమూర్తిగా ఆయన పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగించింది. రాజ్యాంగంలో ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. సంపూర్ణ న్యాయం జరుగుతుందని భావిస్తే సుప్రీం కోర్టుకి న్యాయమూర్తుల పదవీ కాలాన్ని పొడిగించే హక్కు ఉంది. అలా కూల్చివేత ఘటనలో తీర్పు చెప్పిన న్యాయమూర్తిగా యాదవ్ రికార్డు సృష్టించారు. -
బై పోల్.. ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో పుంజుకునే మాట అటుంచి ఢిల్లీ రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం పునాదులను మళ్లీ వేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. బవానా ఉప ఎన్నిక ఫలితాలలో ఆ పార్టీ అభ్యర్థి అనూహ్యాంగా దూసుకుపోతుండటం చర్చనీయాంశంగా మారింది. సోమవారం ఉదయం నుంచి బవానా ఉప ఎన్నికల్లో ప్రస్తుతం ఒక్కో రౌండ్ ఫలితాలు వెలువడుతుండగా, కాంగ్రెస్ అభ్యర్థి సురేందర్ కుమార్ ఆరో రౌండ్ ముగిశాక 3437 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సురేందర్ బవానాకు గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, చివరగా జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇక ఆప్ అభ్యర్థి రాంచంద్ర, బీజేపీ అభ్యర్థి వేద్ ప్రకాశ్ వెనకంజలో ఉన్నారు. తమ అభ్యర్థి ఆధిక్యంలో ఉండటాన్ని కాంగ్రెస్ పార్టీ ఆసక్తిగా తిలకిస్తోంది. ఇక ఇవాళే గోవా లోని పనాజీ, ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్న విషయం తెలిసిందే.