బర్త్‌డేకి సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్న డార్లింగ్‌? | Is Prabhas to Release Radhe Shyam Teaser on his 41st Birthday | Sakshi
Sakshi News home page

రాధే శ్యామ్‌ టీజర్‌.. రిలీజ్‌ డేట్‌ ప్రకటించే యోచన

Published Tue, Sep 1 2020 8:17 PM | Last Updated on Tue, Sep 1 2020 8:23 PM

Is Prabhas to Release Radhe Shyam Teaser on his 41st Birthday - Sakshi

డార్లింగ్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ‘రాధే శ్యామ్’‌ చిత్రం గురించి ప్రస్తుతం ఓ ఆసక్తికర అప్‌డేట్‌ ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతోంది. పుట్టిన రోజు సందర్భంగా డార్లింగ్‌.. అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇవ్వడానికి రెడీ అవుతోన్నట్లు సమాచారం. ప్రభాస్‌ 41 వ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్‌ 23న ‘రాధే శ్యామ్‌’ టీజర్‌ను విడుదల చేయాలని భావిస్తోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే రోజున మూవీ రిలీజ్‌ డేట్‌ను కూడా అనౌన్స్‌ చేయనున్నారట. డార్లింగ్‌ అభిమానులకు ఇంతకంటే కావల్సింది ఏం ఉంది. ఇప్పటికే విడుదలయిన ఫస్ట్‌ లుక్‌, టైటిల్‌ పోస్టర్‌ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. రాధ కృష్ణ దర్శకత్వంలో ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్‌ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. (చదవండి: డబుల్‌ ట్రీట్‌)

ఈ సినిమా చిత్రీకరణ దాదాపు 60 శాతం పూర్తయిందని సమాచారం. అక్టోబర్‌ మూడవ వారం నుంచి ప్రభాస్‌ రాధే శ్యామ్‌ షూటింగ్‌లో పాల్గొంటారనే వార్తలు వచ్చాయి. ఈ చిత్రాన్ని నవంబర్‌ నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాల్లో షూట్‌ చేయడం ఇబ్బంది కనుక హైదరాబాద్‌లోనే వీలైనంత భాగాన్ని సెట్స్‌ వేసి చిత్రీకరించనున్నారని తెలిసింది. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement