
ఇటలీలో ఉన్న గ్రీకు కట్టడాల బ్యాక్‌డ్రాప్‌లో వింటేజ్ కార్ మీద బ్లూ బ్లేజర్ వేసుకుని స్టైలిష్‌గా కూర్చున్న ప్రభాస్ లుక్ అదుర్స్ అంటూ అభిమానులు సంబరపడిపోతున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్’లోని లుక్ ఇది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రసీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం ప్రభాస్ పుట్టిన రోజుని పురస్కరించుకుని చిత్రవర్గాలు ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ, ఈ చిత్రంలో ప్రభాస్ పోషిస్తున్న విక్రమాదిత్య రోల్‌కి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ పరమహంస, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎ¯Œ . సందీప్.
అభిమానులకు పిలుపు
బర్త్‌డే వేడుకలకు దూరంగా ఉండాలనుకుంటున్న ప్రభాస్ వరద బాధితులకు చేయూతగా ఉండాలని అభిమానులకు పిలుపునిచ్చారు. అలాగే తెలంగాణ సీఎం సహాయనిధికి కోటిన్నర రూపాయలు విరాళం అందించారు.