
హరి ప్రసాద్ జక్కా దర్శకత్వంలో దినేష్ తేజ్, అనన్య నాగళ్ల హీరోహీరోయిన్లుగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘ప్లే బ్యాక్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో ప్రసాద్ రావు పెద్దినేని నిర్మించిన ఈ చిత్రంలో అర్జున్ కల్యాణ్, అశోక్ వర్ధన్, దివంగత టీఎన్‌ఆర్, తాగుబోతు రమేష్, మూర్తి, గౌతమ్ రాజు, దీప్తి, తదితరులు నటిస్తున్నారు.
కమ్రాన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఈ ఏడాదిమార్చి 5వ థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. క్రాస్ కనెక్షన్ అనే సరికొత్త అంశంతో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. మే 21 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో మూవీ మేకర్స్ తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. ఒక్క ఫోన్ కాల్.. హీరోను 1993 కాలంలో ఉన్న హీరోయిన్ దగ్గరకు ఎలా తీసుకెళ్లిందో చూపించిన ఈ టీజర్ మరింత ఆసక్తిని పెంచుతోంది.