అందరికి నచ్చేలా ‘ఐ - 20’ | Sakshi
Sakshi News home page

I20 Movie : అందరికి నచ్చేలా ‘ఐ - 20’

Published Sat, May 18 2024 6:01 PM

I20 Movie Audio And Teaser Launch Event Highlights

సూర్యరాజ్ - మెరీనా సింగ్ జంటగా నటించిన తాజా మూవీ "ఐ - 20". బివేర్ ఆఫ్ గర్ల్స్ (అమ్మాయిలతో జాగ్రత్త) అనేది ఉప శీర్షిక.  సూగూరి రవీంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆవిష్కార్ మూవీ క్రియేషన్స్ పతాకంపై  పి.బి.మహేంద్ర నిర్మించారు. తాజాగా ఈ మూవీ పాటలు, ప్రచారచిత్రం ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విడుదల చేశారు.ప్రముఖ ఆడియో సంస్థ మధుర ఆడియో ద్వారా ఈ చిత్రం పాటలు లభ్యం కానున్నాయి!!

తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షులు కె.ఎల్.దామోదర్ ప్రసాద్, ప్రముఖ దర్శకనిర్మాత లయన్ సాయి వెంకట్, ప్రముఖ దర్శకులు వి.సముద్ర ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి రూపొందించిన "ఐ - 20" అందరికీ నచ్చుతుందనే ఆశాభావాన్ని దర్శకనిర్మాతలు వ్యక్తం చేశారు.

మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్ యెలెందర్, గీత రచయిత దేవకరణ్, సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్, కొరియోగ్రాఫర్స్ శైలజ- శ్యామ్ తదితర చిత్రబృందం ఈ వేడుకలో పాల్గొన్నారు. రాగిణి, లీరిషా (సూపర్ ఉమెన్), చిత్రం శ్రీను, జోష్ రవి, పొట్టి చిట్టిబాబు, సద్దాం హుస్సేన్, రియాజ్, పర్శ, పల్లెమోని శ్రీనివాస్, వినోద్ నాయక్ తదితరులు ఈ చిత్రంలో ఇతర కీలకపాత్రలు పోషించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement