
ఈ ఊరిలోకి రావడమే కానీ బయటకు పోయే దారే లేదు, గరుడ పురాణంలో మాయమైపోయిన ఆ నాలుగు పేజీలే ఈ భైరవకోన అన్న డైలాగులు ఆకట్టుకున్నాయి. కేవలం ఒక నిమిషం నిడివి ఉన్న టీజర్
సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న చిత్రం ఊరు పేరు భైరవకోన. కావ్యా థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. హారర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎక్కడికి పోతావు చిన్నవాడా డైరెక్టర్ వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆదివారం (మే 7) సందీప్ కిషన్ బర్త్‌డే పురస్కరించుకుని ఊరు పేరు భైరవకోన టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. శ్రీకృష్ణదేవరాయల కాలంలో చలామణీలో ఉన్న గరుడ పురాణానికి ఇప్పటి గరుడ పురాణానికి నాలుగు పేజీలు తగ్గాయి అన్న వాయిస్ ఓవర్‌తో టీజర్ ప్రారంభమైంది.
'ఈ ఊరిలోకి రావడమే కానీ బయటకు పోయే దారే లేదు', 'గరుడ పురాణంలో మాయమైపోయిన ఆ నాలుగు పేజీలే ఈ భైరవకోన' అన్న డైలాగులు ఆకట్టుకున్నాయి. కేవలం ఒక నిమిషం నిడివి ఉన్న టీజర్‌లో విజువల్స్, బీజీఎం అదిరిపోయాయి. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ సినిమాను రాజేశ్ దండ నిర్మించారు. మరి ఈ చిత్రంతో సందీప్ కిషన్ హిట్ కొడతాడేమో చూడాలి!
చదవండి: బెంజ్ కారు కొన్న బుల్లితెర నటి, ఎన్ని లక్షలో తెలుసా?