
సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, దివ్యాంశా కౌశిక్, వరలక్ష్మీ శరత్‌కుమార్, వరుణ్ సందేశ్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మైఖేల్’. రంజిత్ జయకొడి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పీపై భరత్ చౌదరి, పుసుకర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
ఈ సినిమా టీజర్‌ని ఈ నెల 20న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘‘భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘మైఖేల్’. సందీప్ కిషన్ చేస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది. విజయ్ సేతుపతి యాక్షన్ రోల్ చేస్తున్నారు. డైరెక్టర్ గౌతమ్ మీనన్ విలన్‌గా చేస్తున్నారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: కిరణ్ కౌశిక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్: శివచెర్రీ.
Comments
Please login to add a commentAdd a comment