
చెన్నై : ఎవరైనా అలా అంటే తాను నటించడమే మానేస్తానని నటుడు సందీప్‌కిషన్ అన్నారు. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కన్నాడి. తమిళం, తెలుగు భాషల్లో నిర్మాణం జరుగుతున్న ఈ చిత్ర తెలుగు వెర్షన్‌తో సందీప్‌కిషన్ నిర్మాతగా మారడం విశేషం. తమిళ వెర్షన్‌కు విజీ సుబ్రమణియన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నటి అన్యాసింగ్ కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకుడు. ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో చిత్ర కథానాయకుడు, నిర్మాత సందీప్‌కిషన్ మాట్లాడుతూ తాను నటుడిగా రంగప్రవేశం చేసి 12 ఏళ్లు అవుతోందన్నారు. తాను తన కోసం చిత్రంలో నటించిందే లేదని ప్రేక్షకుల కోసమేనని అన్నారు. అయితే ఇప్పుడు చిత్రాల్లో నటించాలంటే భయంగా ఉందని కారణం ప్రతి చిత్ర విడుదలకు పెద్ద పోరాటమే చేయాల్సి వస్తోందన్నారు. కన్నాడి చిత్రం కోసం పోరాడుతూనే ఉన్నామని చెప్పారు. అయితే మంచి చిత్రం చేయాలనే కఠినంగా శ్రమిస్తున్నట్లు అన్నారు.
తాను ఇప్పటివరకూ 24 చిత్రాల్లో నటించానని, అయితే నిర్మాతగా మారాలని అనిపించింది కన్నాడి చిత్రంతోనేనని అన్నారు. అందరూ దెయ్యాలు, జంతువులతో చేసిన చిత్రాలే సక్సెస్ అవుతున్నాయని, అలాంటి ఇతివృత్తంతో కూడిన కథలయినా తాను వైవిధ్యంగానే నటిస్తానని అన్నారు. ఈ చిత్రంలోని ప్రతి 20 నిమిషాలకు కథ మారుతుంటుందని చెప్పారు. మరో విశేషం ఏమంటంటే ఇది భూతకాలం నుంచి భవిష్యత్ కాలం వరకూ పయనించే చిత్రంగా ఉంటుందన్నారు. 2043లో భవిష్యత్‌లో జరిగే సన్నివేశాలతో కూడిన కథాంశంగా తెరకెక్కిస్తున్న చిత్రంగా కన్నాడి ఉంటుందన్నారు. ఈ చిత్రాన్ని చూసిన తరువాత ఎవరైనా ఇది దెయ్యం కథాంశంతో రూపొందిన చిత్రం అని అంటే తాను నటించడం మానేస్తానని నటుడు సందీప్‌కిషన్ పేర్కొన్నారు. తమిళ వెర్షన్ నిర్మాత విజీ సుబ్రమణియన్ మాట్లాడుతూ కన్నాడి చిత్రాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్న తరువాత ఇందులో హీరోయిన్ ఎవరన్న చర్చ వచ్చినప్పుడు అన్యాసింగ్ పేరును నటుడు సందీప్‌కిషన్ సిఫార్సు చేశారన్నారు. అయినా ఆమెకు ఆడిషన్ నిర్వహించిన తరువాతనే ఎంపిక చేసినట్లు చెప్పారు. ఆమె చిత్రంలో చాలా బాగా నటించారని నిర్మాత అన్నారు.
Sticky for cinema
Comments
Please login to add a commentAdd a comment