– సందీప్ కిషన్
‘‘కెప్టెన్ మిల్లర్, రాయన్’ సినిమాల్లో లీడ్ రోల్స్ చేశాను. అంత మాత్రాన నేను క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉండాలనుకోవడం లేదు. హీరోగా ఉంటూ ఆర్టిస్టుగా కొనసాగాలనుకుంటున్నా. ‘రాయన్’ కథ విని షాక్ అయ్యాను. పైగా ధనుష్‌గారి 50వ సినిమా కాబట్టి గౌరవంతో కూడా ‘రాయన్’ అంగీకరించాను. అలాగే నెగటివ్ రోల్స్ కూడా చేయాలనుకోవడం లేదు.
‘ప్రస్థానం’ సినిమాలో కథలో భాగంగా అక్కను, బావను చంపానని ఆ రోజంతా డిప్రెషన్‌లోనే ఉండి΄ోయాను. అలాంటి మనస్తత్వం నాది’’ అన్నారు సందీప్ కిషన్. ధనుష్ నటించి, స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయన్’. ఇందులో సందీప్ కిషన్ ఓ లీడ్ రోల్ చేశారు. రేపు ఈ చిత్రం విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి ‘రాయన్’ తెలుగు వెర్షన్‌ను విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో సందీప్ కిషన్ చెప్పిన విశేషాలు.
→ నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ ‘రాయన్’. ఈ చిత్రంలో పెద్దన్న కార్తవ రాయన్‌గా ధనుష్‌గారు, రెండోవాడు ముత్తువేల్ రాయన్‌గా నేను, మూడోవాడు మాణిక్య వీర రాయన్‌గా కాళిదాసు, వీరి చెల్లి దుర్గా రాయన్‌గా దుషార కనిపిస్తాం. ఈ ‘రాయన్’ ఫ్యామిలీలో ఏం జరిగింది? అనేది కథ. నిజానికి ధనుష్‌గారు ‘రాయన్’ కథను వేరే దర్శకుడికి ఇచ్చి, ఇందులో నేను చేసిన పాత్రను ఆయన చేయాలనుకున్నారు. కానీ ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహించాల్సి రావడం, ఆయన యాభయ్యవ చిత్రం కావడంతో ఆ రోల్ చేసే చాన్స్ నాకు వచ్చింది. ‘రాయన్’లో నా కోసం రాసుకున్న పాత్రకు మిమ్మల్ని అడుగుతున్నానని ధనుష్‌గారు అన్న వెంటనే ఓకే చె΄్పాను. నాది విలన్ పాత్ర అని చెప్పలేను కానీ ఆడియన్స్ సర్‌ప్రైజ్ అవుతారు.
→ నా కంటే పెద్దవారిని నేనెప్పుడూ గౌరవిస్తాను. అందుకే ‘రాయన్’ ఈవెంట్‌లో ధనుష్‌గారి కాళ్లను టచ్ చేశాను. తన కోసం రాసుకున్న పాత్రను ధనుష్‌గారు నాకు ఇచ్చారు. ఇప్పటివరకు నేను అందుకున్న అత్యధిక పారితోషికం ‘రాయన్’ నుంచే వచ్చింది.
→ నేను తమిళ సినిమాలు చేస్తున్నది అక్కడ మార్కెట్ క్రియేట్ చేసుకోవాలని కాదు. ఇక్కడ దుల్కర్ సల్మాన్, ధనుష్‌గార్ల లాంటి హీరోలకు ఎలాంటి ఆదరణ దక్కుతుందో అలాంటి ప్రేమ నాకు తమిళంలో దక్కాలని. పద్నాలుగేళ్ల నా కెరీర్‌లో 29 సినిమాలు చేశాను. వీటిలో చాలా సినిమాలను ఫ్లాప్స్ అన్నారు. కానీ ఆ సినిమాల థియేట్రికల్ కలెక్షన్స్ బాగున్నాయని నాకు తెలుసు. ఒకవేళ అవి ΄్లాఫ్స్ అనుకున్నప్పటికీ నాకు అవకాశాలు వస్తున్నాయంటే ఆడియన్స్ నన్ను ప్రేమించి, స΄ోర్ట్ చేస్తున్నట్లే కదా.
→ నక్కిన త్రినాథరావుతో ‘మాజాకా’ (వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్నాను. స్వరూప్ డైరెక్షన్‌లో ‘వైబ్’ షూటింగ్ జరుగుతోంది. ‘ఫ్యామిలీ మేన్ 3’ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నా. సైన్స్ ఫిక్షన్ సూపర్ హీరో ఫిల్మ్ ‘మాయవన్ 2’ ఉంది. ‘ఊరు పేరు భైరవకోన’ సీక్వెల్ ఆలోచన ఉంది.
Comments
Please login to add a commentAdd a comment