విలన్ గ్యాంగ్‌లో రౌడీ లేడీ, న్యాయం చేయడానికి కృషి చేసే లాయర్... ఇలా నెగటివ్, పాజిటివ్ క్యారెక్టర్లతో దూసుకెళుతున్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్. తాజాగా ‘మైఖెల్’ సినిమాలో ఓ కీలక పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని చిత్రబృందం గురువారం అధికారికంగా ప్రకటించింది.
సందీప్ కిషన్, దివ్యాంశా కౌశిక్ జంటగా రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. విజయ్ సేతుపతి, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ‘‘యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. సందీప్ కిషన్ పాత్ర ఇంటెన్సిటీతో ఉంటుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో గౌతమ్ మీనన్ విలన్‌గా నటిస్తున్నారు. త్వరలో రెండో షెడ్యూల్ ప్రారంభిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment