సంక్రాంతి తర్వాత థియేటర్ల దగ్గర చెప్పుకోదగ్గ సౌండ్ అయితే లేదు. వచ్చిన ఒకటి రెండు సినిమాలు కూడా బాగుంది అనిపించుకున్నాయి. కానీ జనాలు థియేటర్లకు వెళ్లి చూడటానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అలా అని ఓటీటీలో కొత్త మూవీస్ ఏమన్నా ఉంటాయా అంటే లేదు. ఇలాంటి టైంలో ఓ హిట్ చిత్రం ఓటీటీ రిలీజ్ కానుందని మాట ఇప్పుడు మూవీ లవర్స్‌కి ఆసక్తి రేపుతోంది.
(ఇదీ చదవండి: లండన్‌లో ప్రభాస్ కొత్త ఇల్లు.. నెలకు అన్ని లక్షల అద్దె?)
యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన హారర్ మూవీ 'ఊరు పేరు భైరవకోన'. ఫాంటసీ కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రం చాలారోజులు షూటింగ్ జరుపుకొని ఫిబ్రవరి 16న థియేటర్లలోకి వచ్చింది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ మాత్రం స్టడీగానే ఉన్నాయి. సోమవారం వరకు అంటే దాదాపు 10 రోజుల్లో రూ.25.11 కోట్లకి పైగా వసూళ్లు వచ్చినట్లు స్వయంగా హీరోనే ట్వీట్ చేశాడు.
'ఊరు పేరు భైరవకోన' సినిమా డిజిటల్ హక్కుల్ని జీ5 సంస్థ దక్కించుకుందని తెలుస్తోంది. అలానే థియేటర్లలోకి వచ్చిన నాలుగు వారాల తర్వాత అంటే మార్చి 15న అలా ఓటీటీలోకి రావొచ్చని అంటున్నారు. దీనికంటే ముందు 'హనుమాన్' కూడా ఇదే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాలపై కొన్నిరోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది. అప్పటివరకు వెయిట్ అండ్ సీ.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు.. అవేంటో తెలుసా?)
Thank You All For Your Love ♥️
— Sundeep Kishan (@sundeepkishan) February 26, 2024
Indebted Forever … and Promise to put my heart & soul to only keep Getting Better ♥️
Thank you Dear @Dir_Vi_Anand @AnilSunkara1 garu & @RajeshDanda_ for this Big Breath of Energy 🤗#OoruPeruBhairavaKona @VarshaBollamma @KavyaThapar pic.twitter.com/kxHw4qTpGo
Comments
Please login to add a commentAdd a comment