
యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫ్యాంటసీ అడ్వెంచరస్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో వర్షా బొల్లమ్మ, కావ్యా థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిల్ సుంకర సమర్పణలో ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌పై రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.
లవ్ ఫీల్ తో, రొమాంటిక్ యాంగిల్‌తో ట్రైలర్‌ని ప్రారంభించారు. ఆ తర్వాత కథంతా భైరవకోన అనే ఫాంటసీ ప్రపంచంలోకి కథ మళ్లుతుంది. ‘గరుడ పురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీలే ఈ భైరవకోన’.. ‘భగవంతుడి ఆధీనంలో కూడా లేనిది కర్మ సిద్ధాంతం’, ‘లిఖించబడిందే జరుగుతుంది.. రక్త పాతం జరుగనియ్’ వంటి ఆసక్తికర డైలాగ్స్‌తో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది.
అతీంద్రియ శక్తులు సృష్టించే అవరోధాలు.. వాటిని దాటుకుంటూ వెళ్లి.. తనకు కావాల్సిన దానిని హీరో దక్కించుకోవడమే ప్రధానాంశంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. దైవశక్తి.. క్షుద్రశక్తి తో పాటు వైపు కర్మ సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని ఈ కథ అల్లుకున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. ఫిబ్రవరి 9న ఈ చిత్రం విడుదల కానుంది.
Sticky for cinema
Comments
Please login to add a commentAdd a comment