
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ “రిచి గాడి పెళ్లి” సినిమా నుంచి రెండో సాంగ్‌ను రిలీజ్ చేశారు. నా నిన్నలలో కన్నులలో వెన్నెలలో.. అంటూ సాగే ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా శక్తి శ్రీ గోపాలన్, సత్యన్ ఆలపించారు. ఈ పాట చాలా బాగుందని సందీప్ కిషన్ ప్రశంసలు కురిపించారు. “రిచిగాడి పెళ్లి”లోని రెండో సాంగ్ నా నిన్నలలో కన్నులలో చూశాను సాంగ్‌ను శక్తిశ్రీ గోపాలన్, సత్య ఇద్దరు అద్భుతంగా పాడారు. సాంగ్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. విజువల్ ట్రీట్‌లా అనిపించింది. క్యూట్ అండ్ స్వీట్ సాంగ్. సినిమాటోగ్రఫి పనితనం కూడా చాలా బాగుంది అని మెచ్చుకున్నారు.
చిన్నప్పుడు బల్లల మీద ఆడుకున్న చిన్న చిన్న ఆటలను ఆధారం చేసుకుని తీసిన సినిమా ఇది. ఆ చిన్న ఆట వల్ల వాళ్ళ జీవితాలు ఎలా మలుపులు తిరిగాయనేదే ఈ సినిమా కథాంశం. దర్శకుడు కె యస్ .హేమరాజ్ మాట్లాడుతూ “రిచి గాడి పెళ్లి” అనేది మానవ సంబంధాలకు అద్దంపట్టే కథ. ప్రతి పాత్రలో వేరియేషన్ ఉండేలా డిజైన్ చేశాం. ముఖ్యంగా లిరిక్ రైటర్ శ్రీమణి రాసిన పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది. మా డివోపి విజయ్ ఉలగనాథ్ గారు చేసిన వర్క్ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది” అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment