తండ్రికి స్టైలీష్‌ హెయిర్‌ కట్‌ చేసిన హీరో | Sundeep Kishan Gives A Stylish Haircut To His Dad | Sakshi
Sakshi News home page

కోహ్లి, సచిన్‌ల బాటలో సందీప్‌ కిషన్‌

Published Sun, May 17 2020 11:11 AM | Last Updated on Sun, May 17 2020 12:11 PM

Sundeep Kishan Gives A Stylish Haircut To His Dad - Sakshi

హైదరాబాద్‌: కరోనా లాక్‌డౌన్ ఉండటంతో జనం పలు రకాల ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. కటింగ్, షేవింగ్ చేసుకోవడం కూడా పెద్ద తలనొప్పిగా మారింది. ఆ మాటకొస్తే ఇదో ప్రధాన సమస్యగా మారింది. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు ఈ సమస్య కొనసాగుతూ ఉంది. అయితే స్వయంగా హెయిర్‌ కట్‌ చేసుకోవడమే ఈ సమస్యకు పరిష్కారం అని పలువురు సెలబ్రెటీలు పేర్కొంటున్నారు. ఇప్పటికే విరాట్ కోహ్లీకి తన హార్ట్ బీట్ అనుష్క హెయిర్‌ కట్‌ చేయగా, సచిన్‌ టెండూల్కర్‌ స్వయంగా కటింగ్‌ చేసుకున్నాడు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. 

తాజాగా టాలీవుడ్‌ యంగ్‌ అండ్‌ ట్యాలెంటెడ్‌ హీరో సందీప్‌ కిషన్‌ తన తండ్రికి సోదరితో కలిసి స్వయంగా హెయిర్‌ కట్‌ చేశాడు. తన తండ్రిని స్టైలీష్‌ లుక్‌లోకి మార్చి అది వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ లాక్ డౌన్ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి సందీప్ సరదాగా గడుపుతున్నాడు. గత రెండు నెలలుగా పూర్తిగా ఇంటికే పరిమితం అయిన సందీప్ లాక్ డౌన్ సడలించి షూటింగ్స్ కు అనుమతిస్తే తన ఎ1 ఎక్స్‌ప్రెస్ చిత్రాన్ని పూర్తి చేయాలని ఎదురు చూస్తున్నాడు.

చదవండి:
‘సమరసింహారెడ్డి’ మళ్లీ రిపీట్‌ అవుతుందా?
అదిరేటి లుక్‌లో మహేశ్‌.. సినిమా కోసమేనా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement