నగరానికి ఏమైంది అన్నట్లు.. ఇది వింటే ఈ యువ హీరోలకు ఏమైంది అంటారు. నిజమే వరుసగా గాయాలపాలవుతున్న యువహీరోలను చూస్తే అసలేమైంది. ఎందుకు ఇలా అవుతుంది అనే సందేహం రాక మానదు. టాలీవుడ్ తలరాత బాలేదా లేక మన హీరోల జాతకం బాలేదా లేక ఏమైనా దోషం పట్టుకుందా అన్న అనుమానం వస్తుంది. మొన్నేమో వరుణ్‌తేజ్.. నిన్నేమో నాగశౌర్య.. సందీప్ కిషన్.. తాజాగా ఇవాళేమో శర్వానంద్... ఇలా ఒక్కొరు ప్రమాదాలకు గురవుతూ వస్తున్నారు. ఇంతకు మన టాలివుడ్‌కు ఏమైందంటారు.