టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ పాన్ ఇండియా హీరోగా నటించిన మైఖేల్ మూవీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ రిలీజ్ చేయగా బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో ఈసారి హారర్, థ్రిల్లర్ కాన్సెప్టును ఎంచుకున్నాడు. అలా అతడు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఊరు పేరు భైరవకోన'. ఈ మూవీ ఫిబ్రవరి 16న విడుదల కానుంది. తాజాగా ఇతడు ఓ ఇంటర్వ్యూలో తన బ్రేకప్ బాధను పంచుకున్నాడు.
నా లైఫ్‌లో మూడు బ్రేకప్స్..
'నా జీవితంలో ఇప్పటివరకు ముగ్గురమ్మాయిలను ప్రేమించాను. ఎంతో సీరియస్‌గా లవ్ చేశా.. ఒకరితో నాలుగేళ్ల పాటు రిలేషన్‌లో ఉన్నాను. మరో అమ్మాయితో రెండేళ్లు, మరొకరితో రెండున్నరేళ్లు సీరియస్ లవ్‌లో ఉన్నాను. కానీ ఏదీ వర్కవుట్ కాలేదు. ఈ రోజు నేనున్న పొజిషన్‌లో ఒక్కసారి ఆలోచిస్తే.. అవేవీ నా జీవితంలో అంత ప్రాముఖ్యం కావనిపిస్తున్నాయి. అయితే నేను ప్రేమించిన ముగ్గురూ కూడా ఇండస్ట్రీకి చెందినవారే! నేను ఏళ్ల తరబడి ప్రేమలో ఉన్నా వారెవరు? అనేది బయటకు రానివ్వలేదు. మా లవ్ మ్యాటర్‌ను అంత సీక్రెట్‌గా ఉంచాను. ఇకపోతే రెజీనా, నేను లవ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తుంటాయి. కానీ.. తనకు, నాకు మధ్య అలాంటి లవ్ ట్రాక్ ఏం లేదు. తను నాకు బెస్ట్ ఫ్రెండ్.
పెళ్లంటేనే భయమేస్తోంది
కాలేజీ చదువుకునే రోజుల నుంచీ తను నా స్నేహితురాలు. నా బ్రేకప్స్, కష్టసుఖాలు, ఎత్తుపల్లాలు, జయాపజయాలు.. అన్నీ చూసింది. తనకు, నాకు మధ్య ఏమీ లేదు. ఇక పెళ్లెప్పుడంటారా? ఈ వైవాహిక బంధాన్ని నమ్మడం ఈ మధ్యే ప్రారంభించాను. అదే సమయంలో బయట పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఒక వ్యక్తితో జీవితం పంచుకోవాలంటే చాలా ఆలోచించాలి. ఇంట్లో కూడా పెళ్లి చేసుకోమని ఎవరూ పోరు పెట్టడం లేదు. కాబట్టి దానికింకా టైముంది.' అని చెప్పాడు.
చదవండి: Aishwarya Rajinikanth: రెండేళ్లుగా అదే తెలుసుకున్నా.. ఒంటరితనమే బాగుంది!
Comments
Please login to add a commentAdd a comment