‘గల్లీ రౌడీ’ని లాంచ్‌ చేయనున్న ‘స్టేట్‌ రౌడీ’ | Megastar Chiranjeevi Launches Sundeep Kishan Movie Gully Rowdy Trailer | Sakshi
Sakshi News home page

Sandeep Kishan's Gully Rowdy : మెగాస్టార్‌ చేతుల మీదుగా ‘గల్లీ రౌడీ’ ట్రైలర్‌ లాంచ్‌

Published Fri, Sep 10 2021 8:56 AM | Last Updated on Fri, Sep 10 2021 10:04 AM

Megastar Chiranjeevi Launches Sundeep Kishan Movie Gully Rowdy Trailer - Sakshi

హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోతున్న టాలీవుడ్‌ యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌. ‘స్నేహ గీతం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ నటుడు ప్రస్తుతం కోలీవుడ్‌లోనూ అవకాశాలు దక్కించుకుంటున్నాడు. కెరీర్‌ తొలినాళ్లలో ‘రోటీన్‌ లవ్‌స్టోరీ’ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ లాంటి మంచి హిట్లను అందుకున్నా ఈ కుర్ర హీరో అనంతరం ఎన్నో సినిమాల్లో నటించిన ప్రేక్షకులను మెప్పిచడంలో మాత్రం విఫలమయ్యాడనే చెప్పాలి. దీంతో మంచి హిట్‌ కొట్టాలనే కసితో గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. ఈ తరుణంలో తన కొత్త సినిమా ‘గల్లి రౌడీ’పై సందీప్‌ భారీ ఆశలే పెట్టుకున్నాడు.

ఈ సినిమా ట్రైలర్‌ని మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా శనివారం (సెప్టెంబర్‌ 11న)  సాయంత్రం 5:04 నిమిషాలకు లాంచ్‌ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ప్రొడ్యూసర్‌ బీవీ రాజ్‌ టీం అఫిషీయల్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ‘గల్లీ రౌడీ’ ట్రైలర్‌ లాంచ్‌ చేయనున్న ‘స్టేట్‌ రౌడీ’ అంటూ ఎనౌన్స్ మెంట్ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో నేహా శెట్టి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. కోన వెంకట్‌ సమర్పణలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మించారు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్‌, పోసాని కృష్ణమురళీ, తమిళ నటుడు బాబీ సింహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సెన్సార్‌ పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీని ఈ నెల 17న థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement