‘‘ఊరు పేరు భైరవకోన’ సినిమాకి దాదాపు వంద ప్రీమియర్ షోలు పడ్డాయి. థియేటర్స్‌కి వచ్చిన ప్రతి ప్రేక్షకుడికి థ్యాంక్స్. మా మూవీ పాటలు, ట్రైలర్, ప్రీమియర్‌కు మీరు (ప్రేక్షకులు) ఇచ్చిన స్పందన, మా మీద మీరు పెట్టుకున్న నమ్మకానికి రుణపడి ఉన్నాం’’ అన్నారు సందీప్ కిషన్. వీఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా, కావ్యా థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. అనిల్ సుంకర సమర్పణలో రాజేశ్ దండా నిర్మించారు.
ఈ సినిమా నేడు రిలీజజ్ అవుతోంది. ఈ సందర్భంగా గురువారం నిర్వహించిన బ్లాక్ బస్టర్ ప్రీమియర్స్ సక్సెస్ ప్రెస్‌మీట్‌లో అనిల్ సుంకర మాట్లాడుతూ–‘‘మా సినిమా ప్రీమియర్సే కోటి రూపాయల వసూళ్లు సాధించడం ఆనందాన్నిచ్చింది’’ అన్నారు. ‘‘ఈ రోజు రిలీజవుతున్న మా సినిమాని అందరూ చూడాలి’’ అన్నారు వీఐ ఆనంద్, రాజేశ్ దండా.
Comments
Please login to add a commentAdd a comment