![Bandi Saroj Kumar Parakramam Movie Trailer Launch Event](/styles/webp/s3/article_images/2024/08/16/bandi-saroj-kumar.jpg.webp?itok=bB_kUNov)
బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా 'పరాక్రమం'. శృతి సమన్వి, నాగ లక్ష్మి కీలక పాత్రధారులు. సెన్సార్ పూర్తి చేసుకుని ఈనెల 22న థియేటర్లలోకి రానుంది. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో సందీప్ కిషన్, నిర్మాత ఎస్కేఎన్ హాజరయ్యారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్)
సరోజ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి మనిషికి కనెక్ట్ అయ్యే సినిమా. నేను అభిమానించే చిరంజీవి పుట్టినరోజున 'పరాక్రమం' రిలీజ్ కానుండటం సంతోషంగా ఉంది. చిరంజీవిని చిరంజీవి అనే పిలుస్తా. ఆయనకు భారతరత్న కూడా చిన్నదే అనేది నా అభిప్రాయం. చిరంజీవి అంటే శిఖరం. ఆయన హీరోగా నాలాంటి ఎంతోమందిని ఇన్స్‌పైర్ చేశారని అన్నాడు.
సందీప్ కిషన్ మాట్లాడుతూ.. బండి సరోజ్ కుమార్ చాలా జెన్యూన్ ఫిలింమేకర్. ఆయన వ్యక్తిత్వం కూడా అలాగే ఉంటుంది. ఆయన సినిమా ఈవెంట్స్ కూడా రొటీన్ గా ఉండవు. నేను చెన్నైలో పోర్కాలం అనే సినిమా చూసి ఎవరీ దర్శకుడు అనుకుని ఆశ్చర్యపోయా. ఆయన బండి సరోజ్ కుమార్. ఆ తర్వాత ఆయనను ఫేస్ బుక్ లో వెతికి మరీ టచ్ లోకి వెళ్లా. ఆయన సినిమాలు యూట్యూబ్‌లో చూసి నేనూ డబ్బులు పంపించాం. పరాక్రమం జెన్యూన్ ఫిల్మ్ అని చెప్పాడు.
(ఇదీ చదవండి: జాతీయ ఉత్తమ చిత్రంగా 'ఆట్టమ్'.. ఏంటి దీని స్పెషాలిటీ?)
Comments
Please login to add a commentAdd a comment