గల్లీ క్రికెట్ నేపథ్యంలో ‘పరాక్రమం’ | Bandi Saroj Kumar Parakramam Set For Summer Release | Sakshi
Sakshi News home page

గల్లీ క్రికెట్ నేపథ్యంలో ‘పరాక్రమం’

Published Thu, Feb 15 2024 10:16 AM | Last Updated on Thu, Feb 15 2024 11:11 AM

Bandi Saroj Kumar Parakramam Set For Summer Release - Sakshi

గల్లీ క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న తెలుగు చిత్రం ‘పరాక్రమం’. 'మాంగల్యం' మూవీ ఫేమ్‌ బండి సరోజ్‌ హీరోగా నటిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. గతంలో మూడు సినిమాలు డిజిటల్ లో ‘వాచ్ అండ్ పే’ (డబ్బు కట్టి సినిమా చూసే పద్ధతి) ద్వారా విడుదల చేసి, విజయం సాధించాడు బండి. ఇప్పుడు ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు సంగీతం, ఎడిటింగ్‌తో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు.  

తన సొంత బ్యానర్ బి ఎస్ కె మెయిన్ స్ట్రీమ్ (BSK Mainstream) ద్వారా ఈ ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఈ చిత్రం లో శాస్త్రీయ నృత్య కళాకారిణి శృతి సమన్వి మరియు నాగ లక్ష్మి హీరోయిన్లుగా నటించారు. మరో 50 మంది నూతన నటి నటులు పరిచయం కాబోతున్నారు. వీళ్లలో చాలామంది థియేటర్ ఆర్టిస్ట్ లు పౌర్ణమి, 100% లవ్ లాంటి చిత్రాలకు సినిమాటోగ్రఫీ గా పనిచేసిన వెంకట్ ఆర్ ప్రసాద్ పరాక్రమం చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement