పరాక్రమం మూవీ.. 'మనిషి నేను' అనే సాంగ్ రిలీజ్ | Tollywood Movie Parakramam Lyrical Song Out Now | Sakshi
Sakshi News home page

Parakramam Movie: పరాక్రమం మూవీ.. 'మనిషి నేను' అనే సాంగ్ రిలీజ్

Published Fri, Jul 19 2024 9:30 PM | Last Updated on Fri, Jul 19 2024 9:30 PM

Tollywood Movie Parakramam Lyrical Song Out Now

బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం "పరాక్రమం". బీఎస్‌కే మెయిన్‌ స్ట్రీమ్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో శృతి సమన్వి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టులో రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమాలోని 'మనిషి నేను' అనే లిరికల్ వీడియో పాటను విడుదల చేశారు. బండి సరోజ్ కుమార్ స్వరపరిచిన ఈ పాటను..  హైమత్ మహమ్మద్ ఆలపించారు.

ఈ సందర్భంగా బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ.. "పరాక్రమం చిత్రం నుంచి నేను రాసి స్వరపరిచిన 'మనిషి నేను' అనే పాటను  విడుదల చేశాం. ఈ పాటని హైమత్ మహమ్మద్ పాడారు. నా పాట అందరికి నచ్చుతుందని భావిస్తున్నా. మా చిత్రాన్ని ఆగష్టులో విడుదల చేస్తున్నాం. త్వరలోనే ట్రైలర్‌తో మీ ముందుకు వస్తాం" అని తెలిపారు. ఈ చిత్రంలో నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్, శాంక్ వెన్నెలకంటి, వంశీరాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement