Parakramam Dream Song: వచ్చాడులే పరాక్రమం..నా కన్నె మనసు చేరే కొత్త సంగమం.. | Dream Song From Bandi Saroj Kumar Parakramam Movie Released, Watch Video Inside | Sakshi
Sakshi News home page

Parakramam Dream Song: వచ్చాడులే పరాక్రమం..నా కన్నె మనసు చేరే కొత్త సంగమం

Published Sun, Aug 4 2024 6:00 PM | Last Updated on Sun, Aug 4 2024 6:31 PM

Dream Song From Bandi Saroj Kumar Parakramam Released

బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం "పరాక్రమం". శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ నుంచి యు/ఎ సర్టిఫికేషన్ పొందింది. ఆగస్టు 22న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు "పరాక్రమం" సినిమా నుంచి 'డ్రీమ్' సాంగ్ ను రిలీజ్ చేశారు.

'డ్రీమ్' సాంగ్ కు బండి సరోజ్ కుమార్ ఆకట్టుకునేలా లిరిక్స్ రాసి బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. శ్రీ వైష్ణవి గోపరాజు అందంగా పాడారు. ఈ సాంగ్ ఎలా ఉందో చూస్తే..'వచ్చాడులే పరాక్రమం..నా కన్నె మనసు చేరే కొత్త సంగమం...తెచ్చాడులే పరాక్రమం.. నా చిట్టి గుండెలోకి వింత యవ్వనం...' అంటూ అమ్మాయి తన మనసులోని తొలిప్రేమ భావాలను చెప్పేలా లవ్ ఫీల్ తో సాగుతుందీ పాట.

లవ్, యాక్షన్, ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ వంటి ఎలిమెంట్స్ తో  "పరాక్రమం" సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులను నచ్చేలా రూపొందించారు బండి సరోజ్ కుమార్. ఈ నెల 22న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ రాబోతోందీ సినిమా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement