‘‘ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభూతి ఇవ్వాలని దాదాపు రెండున్నరేళ్లు ‘ఊరు పేరు భైరవకోన’ సినిమా కోసం ఒక బాధ్యతతో పని చేశాం. ఈ చిత్రం పెద్ద విజయం సాధించడం మా యూనిట్‌కి చాలా అవసరం. ఆ బాధ్యతని, అవసరాన్ని గుర్తు చేసుకుంటూ పని చేశాం’’ అని సందీప్ కిషన్ అన్నారు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. అనిల్ సుంకర సమర్పణలో రాజేశ్ దండా నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదల కానుంది.
(చదవండి: రవితేజ సినిమాతో క్లాష్.. వెనక్కి తగ్గలేమని చెప్పిన సందీప్ కిషన్)
హైదరాబాద్‌లో నిర్వహించిన వేడుకలో ఈ చిత్రం ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ– ‘‘ఊరు పేరు భైరవకోన’ కమర్షియల్లీ ఫుల్ ప్యాకేజ్డ్ ఎంటర్‌టైనర్’’ అన్నారు. ‘‘ఈ సినిమా నా కెరీర్‌లో ఓ సవాల్. ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది’’ అన్నారు వీఐ ఆనంద్. ‘‘ఈ మూవీలో ప్రేమకథ, కామెడీ, ఫ్యాంటసీ, యాక్షన్.. ఇలా అన్ని అంశాలున్నాయి. సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు రాజేశ్ దండా. ‘‘గొప్ప థియేట్రికల్ అనుభూతినిచ్చే మూవీ ఇది. థియేటర్స్‌లోనే ఈ సినిమా చూడండి’’ అన్నారు వర్ష, కావ్య. ఈ చిత్రానికి సహనిర్మాత: బాలాజీ గుత్తా, సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: రాజ్ తోట.
Comments
Please login to add a commentAdd a comment