
సందీప్ కిషన్ హీరోగా నటించిన తాజా చిత్రం మైఖేల్. రంజిత్ జయకొడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను నారాయణ్‌దాస్ కె.నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కూర్ రామ్‌మోహన్ రావు నిర్మిస్తున్నారు. దివ్యాంశా కౌశిక్ హీరోయిన్. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. మాస్ యాక్షన్ సీన్స్‌తో సందీప్ కిషన్ అదరగొట్టాడు. మొదటిసారి పూర్తిగా యాక్షన్ సినిమా చేస్తున్న సందీప్ కిషన్ ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించారు.
ఈ సందర్భంగా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం మూడు సంవరత్సరాల నుంచి కష్టపడుతున్నాను. ఇందుకోసం దాదాపు 24 కిలోల బరువు తగ్గాను. మైఖేల్ సినిమా మీద అంచనాలు చాలానే ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment