కుమారి ఆంటీ పుడ్ బిజినెస్ క్లోజ్.. సాయం చేస్తానంటున్న తెలుగు హీరో | Actor Sundeep Kishan Support For Kumari Aunty Over Her Food Stall Closed, Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

Kumari Aunty Food Stall Controversy: కుమారి ఆంటీ షాప్ మూసివేత..సాయానికి సందీప్ కిషన్

Published Wed, Jan 31 2024 8:25 AM | Last Updated on Wed, Jan 31 2024 10:20 AM

Actor Sundeep Kishan Support For Kumari Aunty Food Stall Closed - Sakshi

సోషల్ మీడియాలో ఎవరు ఎందుకు ఫేమస్ అవుతారో చెప్పలేం. అలా ఈ మధ్య హైదరాబాద్‌లోని రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ పెట్టుకుని బిజినెస్ చేసుకునే కుమారి అనే మహిళ చాలా ఫేమస్ అయిపోయింది. రీల్స్, యూట్యూబ్ వీడియోల్లో ఎక్కడ చూసినా ఆమెనే కనిపించింది. గత కొన్నేళ్లు నుంచి ఈమె షాప్‌ నడిపిస్తూ జీవనం సాగిస్తోంది. తాజాగా పోలీసులు మాత్రం ఈమె వ్యాపారాన్ని మూయించారు. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?)

'బాబు మొత్తం మీ బిల్లు వెయ్యి అయింది.. రెండు లివర్లు ఎక్స్‌ట్రా' అనే ఒక్క లైన్‌తో ఫేమస్ అయిన కుమారి ఆంటీ దగ్గరకు జనాలు గట్టిగా వచ్చారు. ఈ క్రమంలోనే ఆమె వీడియోలు, ఇంటర్వ్యూలు తెగ వైరల్ అయ్యాయి. ఈ మధ్య తన కొత్త సినిమా 'ఊరు పేరు భైరవకోన' ప్రమోషన్లలో భాగంగా హీరో సందీప్ కిషన్, హీరోయిన్ వర్ష బొల్లమ్మ కూడా వచ్చిన భోజనం చేశారు.

తాజాగా ట్రాఫిక్ సమస్య అవుతుందని చెప్పి హైదరాబాద్ పోలీసులు.. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ మూయించారు. ఈ క్రమంలోనే హీరో సందీప్ కిషన్ ఆమెకు అండగా ట్వీట్ చేశాడు. 'ఈమె ఎంతో మందికి స్పూర్తి.. తన కాళ్ల మీద తాను నిలబడి వ్యాపారం చేసుకుంటోంది.. ఆమెను ఇలా ఎందుకు చేస్తున్నారు.. ఆమెతో నా టీం టచ్‌లో ఉంటుంది. వీలైన సాయం చేస్తాను' అని ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఇది కాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' ఓటీటీ తెలుగు సీజన్ రద్దు? అదే అసలు కారణమా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement