టైగర్(2015) చిత్రం తర్వాత హీరో సందీప్ కిషన్,దర్శకుడు వీఐ ఆనంద్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ఊరు పేరు భైరవకోన. వర్ష బొల్లమ్మ, కావ్యా థావర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిల్‌సుంకర ఏజే ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని 'నిజమే నే చెబుతున్నా'.. అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు.
ఈ రొమాంటిక్‌సాంగ్‌ను సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మలపై చిత్రీకరించారు. సంగీత దర్శఖుడు శేఖర్ చంద్ర స్వరపరిచిన ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా సిద్ శ్రీరామ్ ఆలపించారు.
Comments
Please login to add a commentAdd a comment