Dhanush And Sundeep Kishan Captain Miller Teaser Out Now, Video Inside - Sakshi
Sakshi News home page

Captain Miller Teaser Highlights: 'కెప్టెన్‌ మిల్లర్‌' టీజర్‌ రిలీజ్‌.. ధనుష్‌ యాక్షన్‌ సీన్స్‌ విధ్వంసం

Published Fri, Jul 28 2023 6:57 AM | Last Updated on Fri, Jul 28 2023 9:12 AM

Dhanush And Sundeep Kishan Captain Miller Teaser Out Now - Sakshi

సౌత్‌ ఇండియా స్టార్‌ ధనుష్‌ హీరోగా అరుణ్‌ మాథేశ్వరన్‌ తెరకెక్కిస్తున్న పీరియాడికల్‌ సినిమా 'కెప్టెన్‌ మిల్లర్‌'. జి.శరవణన్‌, సాయి సిద్ధార్థ్‌ నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుల్‌ మోహన్‌ కథానాయిక. సందీప్‌ కిషన్‌తో పాటు శివరాజ్‌ కుమార్‌, ప్రియాంక మోహన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నేడు (జులై 28) ధనుష్‌ పుట్టినరోజు సందర్భంగా కెప్టెన్‌ మిల్లర్‌ టీజర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.

(ఇదీ చదవండి: చిత్తూరు నుంచి బాలీవుడ్‌నే ఏలిన అంకుశం రామిరెడ్డి ఎలా మరణించారో తెలుసా?)

1930-40ల నేపథ్యంలో సాగే పీరియాడికల్‌ సినిమాగా దీన్ని తీర్చిదిద్దుతున్నట్లు టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. అందులో ధనుష్‌ మొదటి ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన లూయిస్‌ మెషిన్‌ గన్‌ను చేతిలో పట్టుకొని యుద్ధభూమిలో కనిపించాడు.  ఈ టీజర్ నిడివి 100 సెకన్స్ లోపు మాత్రమే ఉన్నా.. ఈ సినిమాకు చెందిన  ప్రధాన పాత్రలు అన్నిటినీ చూపించారు. ధనుష్‌ గొడ్డలితోనే కాకుండా తుపాకీతో తూటాలు విదిల్చిన తీరు కూడా అమోఘం.  

డిసెంబర్ 15న పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు  మేకర్స్‌ ప్రకటించారు. ధనుష్‌కెరీయర్‌లోనే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. దానికి తోడు పీరియాడిక్ నేపథ్యం సినిమా కాబట్టి మరిన్ని అంచనాలు పెంచింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement