తన తదుపరి చిత్రం 'బ్రహ్మోత్సవం' షెడ్యూల్ పూర్తవ్వడం, పిల్లలకు దసరా సెలవులు కావడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి విహారయాత్ర కోసం పారిస్ ప్రయాణమయ్యారు.
తన తదుపరి చిత్రం 'బ్రహ్మోత్సవం' షెడ్యూల్ పూర్తవ్వడం, పిల్లలకు దసరా సెలవులు కావడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి పారిస్ పయనమయ్యారు. అయితే పారిస్లో అడుగు పెట్టకమందే మహేష్కు మంచి కిక్ లభించింది. మహేష్ ఫ్యామిలీ ఫ్లైట్లో అలా అడుగు పెట్టారో లేదో క్రికెట్ లెజండ్ బ్రియాన్ లారా దర్శనమిచ్చారు. దాంతో మన సూపర్ స్టార్.. అలనాటి మేటి ఆటగాడితో కాసేపు టైం స్పెండ్ చేశారు.
ఇక మహేష్ తనయుడు లిటిల్ సూపర్ స్టార్ గౌతమ్ కూడా లారాతో ఓ ఫొటో దిగాడు. కొడుకు ఆనందాన్ని మహేష్ బాబు తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అప్పుడు.. ఇప్పుడు కూడా ఆ క్రికెట్ లెజెండ్కి తాను పెద్ద ఫ్యాన్ అంటూ, హాలిడేస్కి సూపర్బ్ కిక్ స్టార్ట్ ఇది అంటూ.. మహేష్ ట్వీట్ల రూపంలో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
What a way to kick-start our holidays :) Gautam with the legendary Brian Charles Lara.. pic.twitter.com/V9w4XIzL7Z
— Mahesh Babu (@urstrulyMahesh) October 16, 2015
I was and still am a huge fan of the legend.. A picture I will always cherish :)
— Mahesh Babu (@urstrulyMahesh) October 16, 2015