Mahesh Babu Fans Making Trend With Sarkaru Vaari Paata Hashtag In Twitter - Sakshi
Sakshi News home page

ట్విటర్‌లో ట్రెండింగ్; ‌ఏ కారణం లేకుండానే..

Published Fri, Jan 1 2021 3:02 PM | Last Updated on Fri, Jan 1 2021 4:36 PM

Mahesh Sarkari Vari Paata Trending On Twitter Without Any Reason - Sakshi

టాలీవుడ్​ సూపర్​స్టార్​ మహేష్‌ బాబు ప్రస్తుతం పరశురామ్ ​దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' చిత్రంతో బిజీగా ఉన్నాడు. కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ ఈనెల ఆఖరులో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో అభిమానులు మహేష్‌కు సోషల్‌ మీడియాలో సర్‌ప్రైజ్‌ అందిస్తున్నారు. ప్రస్తుతం ట్విటర్‌లో సర్కారు వారి పాట అనే హ‍్యష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. దీనిని ఏ కారణం లేకుండానే # ‘సర్కారు వారి పాట’ అనే హ‍్యష్‌ ట్యాగ్‌తో ట్విటర్‌లో అభిమానులు ట్రెండ్‌ చేస్తున్నారు. దీన్ని అభిమానులు ఛాలెంజ్‌గా తీసుకొని దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 100k పైగా ట్విట్‌లతో ట్రెండ్‌ చేస్తున్నారు. అలాగే సినిమాకు సంబంధించిన ఏదైనా అప్‌డేట్‌ను విడుదల చేయాలని కోరుతున్నారు. చదవండి: వైరల్‌: కలిసి నటిస్తున్న మహేశ్‌, రణ్‌వీర్‌!

బ్యాంక్ స్కాముల నేపథ్యంలో సర్కారు వారి పాట చిత్ర కథ సాగనుండటం వల్ల బ్యాంకు వాతావరణంలో ఎక్కువ షూటింగ్ వుండే అవకాశం ఉంది. దాంతో హైదరాబాద్‌, అమెరికాలో ఎక్కవ శాతం షూటింగ్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా ట్విటర్‌ వేదికగా మహేష్‌ తన అభిమానులకు న్యూ ఇయర్‌ శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు 2021 న్యూ ఇయర్‌ వేడుక‌ల‌ను మహేష్‌ తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో జరుపుకున్నారు. భార్య నమ్రత, కూతురు సితార, స్నేహితులతో దిగిన ఫోటోలు ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement