Bigg Boss 6 Telugu: Brian Lara Supports To Neha Chowdary, Post Goes Viral - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: నేహా కోసం రంగంలోకి లారా.. క్రికెట్‌ దిగ్గజం ప్రయత్నం ఫలించేనా?

Published Sat, Sep 24 2022 1:38 PM | Last Updated on Sat, Sep 24 2022 2:09 PM

Bigg Boss 6 Telugu: Brian Lara Supports To Neha Chowdary - Sakshi

బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌ విజయవంతంగా రన్‌ అవుతోంది. తొలి రెండు వారాలు చప్పగా సాగిన ఈ షో.. మూడో వారంలో వచ్చేసరికి మాత్రం రసవత్తరంగా మారింది. నామినేషన్స్‌ మొదలు.. కెప్టెన్సీ టాస్క్‌ వరకు ఇంటి సభ్యులు గొడవపడుతూనే ఉన్నారు. మూడో వారంలో వాసంతీ కృష్ణన్‌, బాలాదిత్య, చలాకీ చంటి, ఆరోహి, నేహా చౌదరి,ఇనయా సుల్తానా, శ్రీహాన్‌, రేవంత్‌, గీతూ రాయల్‌ నామినేషన్‌లో ఉన్నారు. ఈ తొమ్మిది మందిలో నుంచి ఒకరు ఈ వారం ఎలిమినేట్‌ అవుతారు.

ఎలాగైనా బిగ్‌బాస్‌ హౌస్‌లో కొనసాగాలనే పట్టుదలతో కసిగా గేమ్‌ ఆడుతున్నారు ఈ తొమ్మిది మంది. తమ ఆట తీరుతో ఆడియన్స్‌ ఓట్లను సంపాదించుకునేందుకు బిగ్‌బాస్‌ హౌస్‌లో తీవ్రంగా కష్టపడుతున్నారు. మరోవైపు తమకు నచ్చిన, తెలిసిన కంటెస్టెంట్స్‌కు ఓట్లు వేయాలని సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు వారి వారి సపోటర్స్‌. అయితే ఇదంతా ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల వరకే పరిమితం అయింది. కానీ తాజాగా ఎలిమినేషన్‌ లిస్ట్‌లో ఉన్న నేహా చౌదరి కోసం మాత్రం ఏకంగా  క్రికెట్‌ దిగ్గజం బ్రియన్‌ లారా రంగంలోకి దిగాడు. ఆమెకు ఓట్లు వేయాలని సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నాడు.

బ్రియన్‌ లారా లాంటి పెద్ద ఆటగాడు నేహా చౌదరికి సపోర్ట్‌ చేయడం ఏంటని అంతా షాకవుతున్నారు. వీరిద్దరికి పరిచయం ఎలా  ఏర్పడిందని నెటిజన్స్‌ చర్చిస్తున్నారు. విషయం ఏంటంటే... బిగ్‌బాస్‌లోకి వెళ్లిన నేహా చౌదరి యాంకర్‌,  స్పోర్ట్స్ ప్రెజెంటర్ గా మంచి గుర్తింపు ఉంది.  ఇండియా క్రికెట్ మ్యాచులకు తెలుగు కామెంట్రీ చేసే వ్యక్తుల్లో నేహా కూడా ఒకరు. ఆ కారణంగానే లారాతో నేహకు పరిచయం ఏర్పడింది. అందుకే ఆమె కోసం లారా తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ పెట్టాడు. మరి లారా ప్రయత్నం ఫలించి నేహా హౌస్‌లో కొనసాగుతుందో లేదో ఆదివారం తెలిసిపోతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement