Neha Chowdary
-
'బిగ్‌బాస్' నేహా చౌదరి గ్లామర్ ట్రీట్.. నవ్వుతూనే అలా (ఫొటోలు)
-
నా భర్తను ద్వేషిస్తున్నాను, ఎందుకంటే? : నేహా చౌదరి
బిగ్‌బాస్ బ్యూటీ నేహా చౌదరి మల్టీ టాలెంటెడ్. మోడల్, యోగా ట్రైనర్, డ్యాన్సర్, స్విమ్మర్, జిమ్నాస్ట్, యాంకర్, అథ్లెట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది నేహా. ఇంట్లో పెళ్లి చేసుకోమని పోరు పెడుతుంటే నావల్ల కాదు బాబోయ్ అని బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్లో పాల్గొంది. ఈ షో ప్రారంభంలోనే ఎలిమినేట్ అయిన నేహా బిగ్‌బాస్ నుంచి బయటకు రాగానే ఏడడుగుల బంధంలో అడుగుపెట్టింది. తన చిన్ననాటి స్నేహితుడు అనిల్‌ను పెళ్లాడింది. బిగ్‌బాస్ 6 గ్రాండ్ ఫినాలే రోజే ఆమె పెళ్లిపీటలెక్కడం విశేషం. తనను పెళ్లికూతురిగా ముస్తాబు చేశాక ఓసారి షోకి వచ్చి నాగార్జున ఆశీర్వాదాలు తీసుకుని మళ్లీ మండపానికి వెళ్లిపోయింది. ఇక సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన భర్తతో కలిసి చేసిన రీల్స్ వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది నేహా. తాజాగా తన భర్తను ద్వేషిస్తున్నానంటూ ఓ పోస్ట్ పెట్టింది. 'నిన్ను నేను ఎంతగానో ద్వేషిస్తున్నాను. ఎందుకంటే.. ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా నిన్నే ప్రేమిస్తున్నాను. అందుకే కాబోలు దీన్ని పెళ్లి అని పిలుస్తారు. నువ్వు ఎంత పెద్దగా గురక పెట్టినా, నన్ను కారు నడపనివ్వకపోయినా, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్స్ నాకివ్వకుండా నువ్వొక్కడివే తినేసినా.. నేను చెప్పిన పని ఏదీ చేయకపోయినా ప్రేమిస్తూనే ఉంటాను. కానీ నువ్వు నాకు సారీ చెప్పి, ఇంకెప్పుడూ అలా నడుచుకోనని ఒట్టేస్తావు చూడు.. మాటిచ్చిన ఐదు నిమిషాల్లోనే మళ్లీ మళ్లీ అవే తప్పులు చేస్తావు. అయినా సరే.. నిన్ను చాలా.. చాలా... చాలా.... ప్రేమిస్తున్నాను. ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమించే విధానానికి నేను ఎప్పుడో ఫిదా అయ్యాను. నువ్వు ఎప్పటికీ నావాడివే' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది నేహా చౌదరి. దీనికి భర్తతో కలిసి దిగిన ఫోటో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Anchor Neha (@chowdaryneha) చదవండి: గ్లామర్ హీరోయిన్.. నటననే నమ్ముకున్న ఆమె చివరకు ఒళ్లు అమ్ముకుంది పవన్ బ్రో విషయంలో థమన్ సీరియస్ -
గ్రాండ్ ఫినాలే నుంచి నేరుగా మండపానికి.. నేహా పెళ్లి ఫోటో వైరల్
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ గ్రాండ్‌గా ముగిసింది. 21 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షోలో రోహిత్, కీర్తి, ఆదిరెడ్డి, శ్రీహాన్, రేవంత్ ఫినాలేకు చేరుకోగా రేవంత్ విజేతగా అవతరించాడు. రూ.40 లక్షలు తీసుకుని శ్రీహాన్ రన్నరప్‌గా నిలిచాడు. అయితే ప్రేక్షకుల ఓట్లు శ్రీహాన్‌కు ఎక్కువ వచ్చాయని, కానీ అతడు బ్రీఫ్‌కేస్ తీసుకోవడంతో రేవంత్ టైటిల్ గెలిచాడని ప్రకటించాడు నాగ్. ఇకపోతే ఈ గ్రాండ్ ఫినాలే వీరిద్దరికే కాదు నేహా చౌదరికి కూడా జీవితాంతం గుర్తుండిపోనుంది. కారణం.. అదే రోజు రాత్రి ఆమె పెళ్లి జరిగింది. తనను పెళ్లి కూతురిని చేసిన తర్వాత గ్రాండ్ ఫినాలే వచ్చిన నేహా షో అయిపోగానే అందరూ మండపానికి వచ్చి ఆశీర్వదించండని కోరింది. ఆదివారం రాత్రి పది గంటలకు ఆమె వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బిగ్‌బాస్ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. నూతన వధూవరులతో వీరు దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: విన్నర్ కంటే ఎక్కువ గెల్చుకున్న శ్రీహాన్, ఎన్ని లక్షలంటే? 28 సీజన్లలో మొట్టమొదటిసారి.. బిగ్‌బాస్ షోలో ఇద్దరు విన్నర్స్ -
మరికొద్ది గంటల్లో పెళ్లి.. గ్రాండ్ ఫినాలేకు వచ్చిన కంటెస్టెంట్
పెళ్లా? బిగ్‌బాస్ షోనా? అంటే బిగ్‌బాస్‌నే ఎంచుకుంది యాంకర్ నేహా చౌదరి. కానీ మూడో వారంలోనే ఎలిమినేట్ కావడంతో ఇంటిదారి పట్టింది. ఇక దొరికిందే ఛాన్స్ అనుకున్న ఆమె కుటుంబసభ్యులు నేడు ఆమె పెళ్లి చేసేస్తున్నారు. అయితే పెళ్లికూతురి గెటప్‌లోనే గ్రాండ్ ఫినాలేకి వచ్చేసింది నేహా చౌదరి. ఇంకో ఏడాదిదాకా పెళ్లిని వాయిదా వేద్దామనుకున్నా, కానీ తప్పలేదని చెప్పింది. విధి ఆడిన వింత నాటకంలో బలిపశువు అయిపోయానని నేహా అనగానే బలిపశువు అయ్యేది నువ్వా? అతడా? అని నాగ్ కౌంటరిచ్చాడు. మీరు బిగ్‌బాస్ విన్నర్ ఎవరనేది ప్రకటించే సమయానికి నా మెడలో మూడు ముళ్లు పడనున్నాయని చెప్పుకొచ్చింది నేహా. పది గంటలకు నాకు పెళ్లైపోతుందని, నా బెస్ట్ ఫ్రెండ్ అనిల్‌నే పెళ్లాడబోతున్నానని తెలిపింది. దీంతో నాగ్ మరికొద్ది గంటల్లో కొత్త జీవితాన్ని ఆరంభించనున్న ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపాడు. ఇక అంత బిజీలోనూ నేహా గ్రాండ్ ఫినాలేకు రావడం గ్రేట్ అనే చెప్పాలి. చదవండి: ఆదిరెడ్డి స్థానం మారింది -
పెళ్లి చేసుకోబోతున్న బిగ్‌బాస్ కంటెస్టెంట్ నేహా చౌదరి.. వరుడు అతనే
బిగ్‌బాస్ సీజన్-6 కంటెస్టెంట్ నేహా చౌదరి పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా నేహానే వెల్లడించింది. అంతేకాకుండా కాబోయే భర్త ఫోటోను కూడా ఆడియెన్స్‌కు రివీల్ చేసింది. యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన నేహా చౌదరి బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకుంది. స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన ఆమె రిథమిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలో జాతీయ స్థాయి చాంపియన్ సాధించింది. అయితే ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్న ఆసక్తితో బుల్లితెరపై అడుగుపెట్టి పలు పలు షోలకు యాంకరింగ్ చేసింది. ఇటీవలె బిగ్‌బాస్-6లో కూడా పాల్గొంది. ఇక ఈ షో ఎంట్రీ సమయంలో కూడా ‘బిగ్‌బాస్'కి వెళ్లొచ్చాక పెళ్లి చేసుకుంటా అని ఇంట్లో వాళ్లకి చెప్పి వచ్చాను’ అని కూడా వెల్లడించింది. అప్పుడు చెప్పినట్లే బిగ్‌బాస్ జర్నీ అనంతరం నేహా పెళ్లి చేసుకోబోతుంది. తన ఇంజనీరింగ్ క్లాస్మేట్ అయిన అనిల్ అనే వ్యక్తినే అతి త్వరలోనే పెళ్లాడబోతున్నట్లు నేహా తెలిపింది. View this post on Instagram A post shared by Anchor Neha (@chowdaryneha) -
నా ఎలిమినేషన్ కు కారణం వారే : నేహా చౌదరి
-
Bigg Boss 6: నేహా ది ఫైటర్
-
అలాంటి వాళ్లు ఉన్నారు..రివేంజ్ తీర్చుకుంటా : నేహా చౌదరి
బిగ్‌బాస్ సీజన్-6లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న నేహా చౌదరి ఎలిమినేట్ అయ్యింది.ఇనయా, వాసంతిలలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని అంతా భావించారు. కానీ ఆర్జీవీ చేసిన ట్వీట్ మహత్యమా తెలీదు కానీ ఇనయా సేఫ్ అయ్యింది. చివరి రౌండ్లో వాసంతి, నేహాలకు మధ్య పోటీ జరగ్గా నేహా ఎలిమినేట్ కావడం షాకింగ్ అనే చెప్పొచ్చు. అసలు గేమ్ పట్లు ఏమాత్రం సీరియస్‌నెస్ లేని కంటెస్టెంట్లు కూడా హౌస్‌లో ఉన్నా నేహా ఎలిమినేట్ కావడం పట్ల కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక తాను ఎలిమినేట్ కావడంపై నేహా చౌదరి కూడా షాక్ అయ్యింది.నమ్మినవాళ్లే ఇలా చేశారని, ముఖ్యంగా రేవంత్ వల్లే తాను బయలికి వచ్చేశానని పేర్కొంది. తాను ఎలిమినేట్ అవుతానని అస్సలు ఊహించలేదని, చాలా షాకింగ్‌గా అనిపిస్తుందని తెలిపింది. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అసహనాన్ని బయటపెట్టింది. తాను ఎందుకు బయటికి వచ్చానో తెలియడం లేదని, తనకంటే అసలు గేమ్ ఆడని వాళ్లు కూడా హౌస్‌లో ఉన్నారని చెప్పింది. అంతేకాకుండా వైల్డ్ కార్డ్ రూపంలో మరోసారి బిగ్‌బాస్‌లోకి వెళ్లే ఛాన్స్ వస్తే తప్పకుండా వెళ్తానని, అసలు రివేంజ్ తీసుకోవాల్సిన వాళ్లు చాలామంది ఉన్నారని పేర్కొంది. -
Bigg Boss 6: నేహా ఔట్.. అతనే మోసం చేశాడంటూ ఎమోషనల్
బిగ్‌బాస్ హౌస్ నుంచి మూడోవారం నేహా ఎలిమినేట్ అయింది. నమ్మినవాళ్లే మోసం చేశారంటూ ఏడుస్తూ బయటకు వచ్చింది. స్టేజ్ మీద రాజ్ గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. అసలు నేహను మోసం చేసిన వ్యక్తి ఎవరు? రాజ్‌తో ఆమెకు ఉన్న బాండింగ్ ఏంటి? ఆమె దృష్టిలో దమ్మున్న ఐదుగురు ఎవరు? ఆదివారం హౌస్మేట్స్ చేసిన సందడి ఏంటి? ఎలాంటి గేమ్స్ ఆడారు? తదితర విషయాలను నేటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. బిగ్‌బాస్ హౌస్‌లో ఆదివారం వచ్చిందంటే చాలు.. సందడి మాములుగా ఉండదు. హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్‌తో చిన్న చిన్న గేమ్స్ ఆడిస్తూ..చివరుకు ఒకరిని ఎలిమినేట్ చేసి పంపిస్తారు. ఈ ఆదివారం కూడా అలానే సందడిగా సాగింది. హౌస్‌మేట్స్‌తో రకరకాలు గేమ్స్ ఆడించాడు. ముందుగా బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌తో ‘సుత్తిదెబ్బ’ ఆట ఆడించాడు హోస్ట్ నాగార్జున. ఒక్కొక్కరు లేచి నాగార్జున అడిగిన ప్రశ్నలకు సూట్ అయ్యే వ్యక్తి ఎవరో చూపించి అతని తలపై సుత్తితో కొట్టాలి. ముందుగా ఆదిరెడ్డిని లేపి ఇంట్లో ఎవరికి ఎక్కువ నోటిదూల ఉంటుందని అడగ్గా.. గీతూ పేరు చెప్పారు. ఆడియన్స్ కూడా ఆదిరెడ్డి నిర్ణయం కరెక్టెనని చెప్పారు. హౌస్‌లో బ్రెయిన్లెస్ ఎవరు? యూజ్లెస్ ఎవరు? యారగెంట్ ఎవరు? గుడ్డి ఎద్దు ఎవరు? అటెన్షన్ సీకరు? తదితర ప్రశ్నలకు ఒక్కో కంటెస్టెంట్ ఒక్కొక్కరిని చెప్పగా..వాటిలో కొన్నింటికి ఆడియన్స్ ఓకే చెప్పి, మరికొన్నింటికి నో చెప్పారు. ముఖ్యంగా రేవంత్ విషయంలో హౌస్మేట్స్ ఒకటి చెబితే..ఆడియన్స్ మరొకటి చెప్పారు.దీంతో రేవంత్ గాల్లో తేలిపోయాడు. ఇక ఆ తర్వాత నామినేషన్స్‌లో ఉన్న తొమ్మిది మందికి ఎన్వలప్ కవర్స్ ఇచ్చి..అందులో ఎక్కువగా డబ్బులు ఉన్నవారు సేవ్ అని అవుతారని చెప్పగా... శ్రీహాన్, గీతూల కవర్స్‌లో ఎక్కువ డబ్బులు రావడంతో ఇద్దరూ సేఫ్ అయ్యారు. ఆ తర్వాత హౌస్‌మేట్స్‌లో మరో ఆట ఆడించాడు నాగార్జున. కొన్ని జంతువుల బొమ్మలు ఇచ్చి..వాటిలో ఏవి ఎవరికి ఇస్తారో చెప్పమన్నాడు. దీంతో హౌస్మేట్స్ ఒక్కొక్కరు ఒక్కో బొమ్మను వేరేవాళ్లకి ఇస్తూ దానికి గల కారణాలు చెప్పారు. ఇక నామినేషన్లో చివరగా వాసంతి, నేహాలు ఉండగా... వారిద్దరి ఫోటోలను తులాభారంలో ఉంచి ఎవరి బరువు తక్కువగా ఉంటే వాళ్లు ఎలిమినేట్ అవుతారని చెప్పాడు. ఇద్దరిలో నేహా ఎలిమినేట్ అయింది. నమ్మినవాళ్లే నన్ను ఇక్కడ నిలబెట్టారని ఎమోషనల్ అవుతూ నేహా బయటకు వచ్చేసింది. స్టేజ్‌మీదకు రాగానే ఆమె ఏవీ వేసి చూపించారు. అనంతరం ఆమెకు ఓ టాస్క్ ఇచ్చాడు నాగార్జున. హౌస్‌లో ఉన్నవారిలో ఐదుగురిని దమ్ము ఉన్న కెటగీరిలో..మరో ఐదుగురిని దుమ్ము కేటగిరీలో పెట్టమని చెప్పాడు. దుమ్మున్న కేటగిరీలో ఆరుగురిని పెడతానంటూ..ఇనయా, రేవంత్, ఆరోహి, అర్జున్, వాసంతి, గీతూ ఫోటోలను పెట్టింది. అన్నంతరం రేవంత్ గురించి చెబుతూ..అతని వల్లనే నేను ఎలిమినేట్ అయ్యానని చెప్పుకొచ్చింది. ఇక దమ్మున్న కేటగిరీలో..రాజు, చంటి, సుదీప, బాలాదిత్య, ఆదిరెడ్డి, శ్రీహాస్, శ్రీసత్య ఫోటోలను పెట్టింది. అనంతరం ఒక్కోక్కరి గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. ముఖ్యంగా రాజ్ విషయంలో చాలా నేహ మరింత ఓపెన్ అయింది. ‘రాజ్‌తో నాకు మొదటి నుంచి మంచి బాడింగ్ ఉంది. నా జీవితంలోకి గత కొన్నేళ్లుగా ఏ అబ్బాయిని రానివ్వలేదు. కానీ రాజ్ ద్వారా నాకు మంచి ఫ్రెండ్ దొరికాడు. మేం గ్రేట్ ఫ్రెండ్స్‌మి.బయటకు వచ్చాక కూడా మా ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది. ‘రాజ్ బయటకు వచ్చాక కూడా నేనే నీ బాడీగార్డ్’అంటూ నేహా తన బిగ్‌బాస్ ప్రయాణాన్ని ముగించింది. -
Bigg Boss- 6 : షాకింగ్ ఎలిమినేషన్: ఈవారం ఎవరు ఎలిమినేట్ అయ్యారంటే..
బిగ్‌బాస్ సీజన్-6 రసవత్తరంగా ముందుకు సాగుతుంది. తొలి రెండు వారాలు చప్పగా సాగిన ఈ షో.. మూడో వారంలో వచ్చేసరికి మాత్రం రసవత్తరంగా మారింది. నామినేషన్స్ మొదలు.. కెప్టెన్సీ టాస్క్ వరకు ఇంటి సభ్యులు గొడవపడుతూనే ఉన్నారు. ఇదిలా ఉండగా గతవారం డబుల్ ఎలిమినేషన్‌తో షానీ, అభినయలు హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారన్న విషయంలో ఆసక్తి మొదలైంది. మూడోవారంలో వాసంతీ కృష్ణన్, బాలాదిత్య, చలాకీ చంటి, ఆరోహి, నేహా చౌదరి,ఇనయా సుల్తానా, శ్రీహాన్, రేవంత్, గీతూ రాయల్ నామినేషన్లో ఉన్నారు. వీరిలో రేవంత్, గీతూ తమ ఆటతీరుతో ఎక్కువ ఓట్లు సంపాదించుకున్నారు. ఇక ఆరోహి, నేహా, ఇనయాలు డేంజర్ డోన్‌లో ఉండగా ఇనయా ఎలిమినేట్ అవుతుందని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా నేహా చౌదరి ఎలిమినేట్ అయిందని ఇప్పటికే లీకువీరులు లీక్ చేశారు. అర్థంపర్థం లేని రాద్దాంతం చేస్తూ చీటికిమాటికి గొడవపడుతూ ఇనయా బాగానే కంటెంట్ ఇచ్చింది. దీంతో చివరి నిమిషంలో ఆమె సేవ్ అయి నేహా చౌదరి ఎలిమినేట్ అయిందని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందన్నది తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేవరకు వేచిచూడాల్సిందే. -
Bigg Boss 6: నేహా కోసం రంగంలోకి లారా.. క్రికెట్ దిగ్గజం ప్రయత్నం ఫలించేనా?
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ ఆరో సీజన్ విజయవంతంగా రన్ అవుతోంది. తొలి రెండు వారాలు చప్పగా సాగిన ఈ షో.. మూడో వారంలో వచ్చేసరికి మాత్రం రసవత్తరంగా మారింది. నామినేషన్స్ మొదలు.. కెప్టెన్సీ టాస్క్ వరకు ఇంటి సభ్యులు గొడవపడుతూనే ఉన్నారు. మూడో వారంలో వాసంతీ కృష్ణన్, బాలాదిత్య, చలాకీ చంటి, ఆరోహి, నేహా చౌదరి,ఇనయా సుల్తానా, శ్రీహాన్, రేవంత్, గీతూ రాయల్ నామినేషన్లో ఉన్నారు. ఈ తొమ్మిది మందిలో నుంచి ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు. ఎలాగైనా బిగ్‌బాస్ హౌస్‌లో కొనసాగాలనే పట్టుదలతో కసిగా గేమ్ ఆడుతున్నారు ఈ తొమ్మిది మంది. తమ ఆట తీరుతో ఆడియన్స్ ఓట్లను సంపాదించుకునేందుకు బిగ్‌బాస్ హౌస్‌లో తీవ్రంగా కష్టపడుతున్నారు. మరోవైపు తమకు నచ్చిన, తెలిసిన కంటెస్టెంట్స్‌కు ఓట్లు వేయాలని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు వారి వారి సపోటర్స్. అయితే ఇదంతా ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల వరకే పరిమితం అయింది. కానీ తాజాగా ఎలిమినేషన్ లిస్ట్‌లో ఉన్న నేహా చౌదరి కోసం మాత్రం ఏకంగా క్రికెట్ దిగ్గజం బ్రియన్ లారా రంగంలోకి దిగాడు. ఆమెకు ఓట్లు వేయాలని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నాడు. బ్రియన్ లారా లాంటి పెద్ద ఆటగాడు నేహా చౌదరికి సపోర్ట్ చేయడం ఏంటని అంతా షాకవుతున్నారు. వీరిద్దరికి పరిచయం ఎలా ఏర్పడిందని నెటిజన్స్ చర్చిస్తున్నారు. విషయం ఏంటంటే... బిగ్‌బాస్‌లోకి వెళ్లిన నేహా చౌదరి యాంకర్, స్పోర్ట్స్ ప్రెజెంటర్ గా మంచి గుర్తింపు ఉంది. ఇండియా క్రికెట్ మ్యాచులకు తెలుగు కామెంట్రీ చేసే వ్యక్తుల్లో నేహా కూడా ఒకరు. ఆ కారణంగానే లారాతో నేహకు పరిచయం ఏర్పడింది. అందుకే ఆమె కోసం లారా తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ పెట్టాడు. మరి లారా ప్రయత్నం ఫలించి నేహా హౌస్‌లో కొనసాగుతుందో లేదో ఆదివారం తెలిసిపోతుంది. -
Bigg Boss 6: కెమెరా ముందు రోహిత్, మెరీనా రొమాన్స్.. ‘చూసింది చాల్లే పో’
Bigg Boss6 Telugu Episode 10: నామినేషన్లో చేసిన ఆరోపణలపై ఇంటి సభ్యులంతా వివరణ ఇచ్చుకున్నారు. అర్జున్ కల్యాణ్ వచ్చి శ్రీసత్యతో రేవంత్ చేసిన కామెడీపై చర్చించారు. అమ్మాయిలతో అలా ముడిపెట్టి కామెంట్ చేయడం నచ్చలేదని, అందుకే రేవంత్‌ని నామినేట్ చేశానని కల్యాణ్ చెప్పాడు. ఇక గీతూ, ఆదిరెడ్డిలు గేమ్ ప్లాన్ గురించి మాట్లాడుకున్నారు. ‘నామినేషన్స్ తర్వాత సేవ్ అవ్వడానికి ట్రై చేయడం కన్నా..నామినేషన్స్‌లో ఉన్నప్పుడే నిన్ను నువ్వు సేవ్ చేసుకోచ్చు తెలుసా? అంటూ ఆదిరెడ్డికి ఉచిత సలహా ఇచ్చింది గీతూ. నామినేషన్స్‌లో నీకంటే వీక్‌గా ఉన్న కంటెస్టెంట్స్‌ని నామినేట్ చేస్తే.. వాళ్లు బయటకు వెళ్లే చాన్స్ ఉంటుందని గీతూ చెప్పుకొచ్చింది. రాజశేఖర్, ఇనయా సుల్తానా లాంటి వాళ్లను నామినేట్ చేస్తే మనం సేవ్ అవుతామని చెప్పింది. అయితే ఆదిరెడ్డి మాత్రం అన్నం తింటూ... గీతూ చెప్పింది విని వినట్టుగా ‘ఊ’కొట్టాడు అంతే. మరోవైపు బాలాదిత్య .. రేవంత్‌కి క్లాస్ తీసుకున్నాడు. నామినేషన్లో హైపర్ అవుతున్నామని, అది తగ్గించుకోవాలని చెప్పాడు. ‘ఒక మనిషి నీతో మాట్లాడడానికి సంకోచించాడు అంటే.. నీ సైడ్ నుంచి ఎక్కడో చిన్న పొరపాటు ఉన్నట్లే కదా? ఒకరిద్దరు చెప్తే వాళ్లది తప్పు కావొచ్చు, కానీ ఐదారుగురు చెప్పారంటే నీ సైడ్ తప్పు ఉండే అవకాశం ఉంది కదా? ఇప్పటికీ మించి పోయిందేమి లేదు. నువ్వు చర్చించినకొద్ది ఇంకా హైపర్ అయిపోతున్నావ్, కోపం వచ్చేస్తుంది.. అందుకే ఎక్కువగా చర్చించకు’అని రేవంత్‌కు హితబోధ చేశాడు బాలాదిత్య. ఇక ఆర్జే సూర్య, ఆరోహి..బాలాదిత్య గురించి మాట్లాడుకున్నారు. పట్టుకుందాం అంటే ఒక్క పాయింట్లో కూడా దొరకడం లేదని ఆరోహి అంటే.. దొరుకుతాడు దొరుకుతాడు అని సూర్య అన్నాడు. ఆదిరెడ్డి నామినేషన్స్‌లో నీకు సాలిడ్ కౌంటర్ ఇచ్చాడని ఆరోహితో చెప్పాడు సూర్య. దానికి ఆరోహి అవును. నేను కూడా ఏం మాట్లాడలేకపోయానని చెప్పింది. ‘ఈ హౌస్‌లో మనిద్దరమే ఫ్రెండ్స్ ఉన్నాం కాబట్టి.. మనం కలసి ఆడుతున్నామనే మాట వస్తుంది. దానికి కూడా రెడీ అయ్యిండాలి’ అని ఆరోహితో చెప్పాడు ఆర్జే సూర్య. ఇక ఉదయాన్నే ముద్దులతో హల్చల్ చేసింది రోహిత్ మెరీనా జంట. బెడ్రూంలో ఇద్దరు హద్దులు మీరి ముద్దులు పెట్టుకున్నారు. కెమెరా ఉందని తెలిసినా.. కావాలనే కంటెంట్ కోసం వాళ్లు రొమాన్స్ చేశారు. పక్కనే ఉన్న నేహ చౌదరిని ‘చూసింది చాల్లే.. మేము రొమాన్స్ చేసుకోవాలి.. నువ్ వెళ్లిరా’అని మెరీనా అనడంతో.. నాక్కుడా వెంటనే పెళ్లి చేసుకోవాలని ఉంది అని అనేసింది నేహా. ఇక శ్రీ సత్య అయితే అందరితో కూర్చుని తినడం తన వల్ల కాదని.. నాకు నచ్చింది చేయడానికి ఇక్కడకు వచ్చాను తప్పితే.. అందరికీ నచ్చింది చేయడానికి రాలేదని చెప్పింది. ఆ తరువాత రెండోవారం కెప్టెన్సీ టాస్క్ ప్రారంభం అయ్యింది. దాని పేరే సిసింద్రీ. ఈ టాస్క్‌లో భాగంగా ప్రతి ఇంటి సభ్యులకు ఒక బేబీ బొమ్మను ఇస్తారు. ఇంటి సభ్యులందరూ తమ బేబీ బాగోగులు చూసుకుంటూ టాస్క్‌లో సమయానుసారం బిగ్‌బాస్ ఇచ్చే చాలెంజెస్లలో పాల్గొనాలి. బజర్ మోగినప్పుడల్లా ఏ ఐదుగురు సభ్యులైతే ముందుగా వారి బేబీస్‌ని గార్డెన్ ఏరియాలో ఉన్న చైర్లో ఉంచుతారో వారు మాత్రమే బిగ్‌బాస్ ఇచ్చే చాలెంజెస్‌లో పాల్గొనాలి. ప్రతి చాలెంజ్‌లో గెలిసిన సభ్యలు కెప్టెన్సీ పోటీదారులు అవుతారు. టాస్క్ సమయంలో బేబీ బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత వారిదే. ఆ సమయంలో బేబీస్ మీ దగ్గర కాకుండా.. లాస్ట్ అండ్ పౌండ్ ఏరియాలో లభిస్తే కెప్టెన్సీ పోటీదారులు అయ్యే అవకాశాన్ని కోల్పోతారు. ఏ ఇంటి సభ్యులైనా బేబీని ఇంట్లో ఒంటరిగా వదిలేస్తే.. వారిని కెప్టెన్సీ పోటీదారుల నుంచి తప్పించడానికి మిగతా సభ్యులు ఆ బేబీని లాస్ట్ అండ్ పౌండ్ ఏరియాలో పెట్టవచ్చు’అని బిగ్‌బాస్ చెప్పాడు. ఇక బిగ్‌బాస్ ఇచ్చిన మొదటి చాలెంజెస్‌లో ఆరోహి, చంటి, రేవంత్, ఫైమా, గీతూ పాల్గొనగా.. చంటి విజయం సాధించాడు. -
నాకు ఫోన్ కొనివ్వడానికి మా నాన్న అప్పు చేశారు: బిగ్‌బాస్ నేహా చౌదరి
బులితెరపై ఎంతో ఆదరణ పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్. తెలుగులో ఇప్పటి వరకు ఈ షో 5 సీజన్లు పూర్తి చేసుకోగా.. తాజాగా ఆరో సీజన్లోకి అడుగు పెట్టింది. సెప్టెంబర్ 4న బిగ్‌బాస్ 6వ సీజన్ గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. ఈ సీజన్‌తో ఆడియన్స్‌కి డబుల్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు 21 మంది కంటెస్టెంట్స్‌ని రంగంలోకి దింపారు. వారిలో 11 మంది అమ్మాయి ఉన్నారు. అందులో ప్రముఖ యాంకర్ నేహా చౌదరి ఒకరు. స్టార్ స్పోర్ట్స్‌లో యాంకర్‌గా దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఆమె ఈ సీజన్ కోసం బిగ్‌బాస్ ఆఫర్ అందుకుంది. ఈ నేపథ్యంలో హౌజ్‌లో అడుగు పెట్టే ముందు నేహా ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ఆసక్తిర విషయాలను బయటపెట్టింది. తనది వ్యవసాయ కుటుంబ నేపథ్యమని, చిన్నతనంలో వారు చాలా కష్టపడ్డట్లు చెప్పింది. తన కెరీర్ కోసం వాళ్ల నాన్న ఎకరాలు ఎకరాలు అమ్మేసారంటూ నేహా ఆవేదన వ్యక్తం చేసింది. వాళ్ల నాన్న అప్పు చేసి తనకు ఫోన్ కొనిచ్చాడంటూ నేహా వాపోయింది. ఇక అమ్మానాన్న సైడ్ బంధువులంతా ఫారెన్‌లో, సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో సెటిల్ అయితే తాను స్పోర్ట్స్ సైడ్ వెళ్లానని చెప్పింది. అలా జిమ్నాస్టిక్స్‌కి వెళ్లాను అని తెలిపింది. చదవండి: ఆస్పత్రి బెడ్‌పై షణ్ముఖ్ జశ్వంత్, ఫ్యాన్స్ ఆందోళన ‘నేను చాలా చిన్న వయసులోనే చాలా ఫాస్ట్‌గా జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నా. సీనియర్స్‌తో పోటీ పడేదాన్ని. నా కోచ్ కూడా ప్రాక్టీస్ చేపించేటప్పుడు నా సీనియర్స్‌తో చేపించేవారు. నా సీనియర్ ఓ అమ్మాయి నన్ను దారుణంగా ర్యాగింగ్ చేసేది. దాన్ని ర్యాగింగ్ అనేది చాలా చిన్న మాట అవుతుంది. అంతలా నన్ను ఆమె టార్చర్ చేసింది. ఇంకా కొంతమంది నన్ను దారుణంగా ఇబ్బంది పెట్టేవాళ్లు. నేను పడుకుని ఉంటే గట్టిగా గిచ్చి పారిపోయవారు. లేచిచూస్తే ఎవరూ ఉండేవాళ్లు కాదు. అంతలా నా కోర్స్ సెంటర్లో నన్ను ఇబ్బంది పెట్టారు’ అని చెప్పుకొచ్చింది. ‘ఏదైనా ఈవెంట్ కోసం ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా నన్ను ఏడిపించేవారు. నాకిప్పటికీ గుర్తుంది. ఈవెంట్ కోసం వేరే ప్రాంతానికి వెళుతుండగా ట్రైన్లో పైన పడుకుని ఉంటే.. కిందనుంచి పిన్స్‌తో, పుల్లలతో గుచ్చేవాళ్లు. బాగా ఏడ్చేదాన్ని. ట్రైన్లోంచి దూకేద్దామా అన్నంతగా నన్ను ఏడిపించారు. కానీ, నేను ఇది అమ్మావాళ్లకు చెప్పలేకపోయేదాన్ని’ అంటూ ఆమె వాపోయింది. ఈ స్పోర్ట్స్ వల్ల తన పేరెంట్స్‌ని ఏమాత్రం ఆనందపెట్టలేకపోయానంది. అందుకే తాను సినీ రంగంలోకి వచ్చానని, కానీ ఇక్కడ కూడా మొదట్లో ఎన్నో రిజెక్షన్స్ ఎదుర్కొన్నానని నేహా తెలిపింది.‘ఒకే చానల్‌కి రెండుమూడు సార్లు ఇంటర్య్వూకి వెళ్లాను. వాళ్లు తర్వాత చూద్దామనేవారు. కానీ వారి నుంచి ఎలాంటి ఫోన్‌కాల్ వచ్చేది కాదు. రూంకి వెళ్లి చాలా బాధపడేదాన్ని’ అని చెప్పుకొచ్చింది. ఇక తన ఫస్ట్ రెమ్యునరేషన్ రూ. 500లని ఈ సందర్భంగా ఆమె వెల్లడిచింది. చదవండి: ఉత్కంఠభరితంగా ‘పొన్నియన్ సెల్వన్’ ట్రైలర్ -
సంబంధాలు చూస్తున్నారు, నాకు అలాంటి వాడు కావాలి: నేహా చౌదరి
Neha Chowdary In Bigg Boss 6 Telugu: యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన నేహా చౌదరి బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకుంది. స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఇచ్చిన ఆమె రిథమిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలో జాతీయ స్థాయి చాంపియన్ సాధించింది. అయితే ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్న ఆసక్తితో బుల్లితెరపై అడుగుపెట్టి పలు పలు షోలకు యాంకరింగ్ చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ (ఐపీఎల్)లో యాంకర్‌గా నేహా చౌదరి మాంచి పాపులారిటీని దక్కించుకుంది. తెలుగుమ్మాయిగా బాంబే గడ్డపై యాంకరింగ్‌తో అలరించిన నేహా మరిప్పుడు బిగ్‌బాస్ షోలో ప్రేక్షకులను ఏ విధంగా మెప్పించనుంది అన్నది చూద్దాం.