Bigg Boss Neha Choudary Shares Post About Her Husband With Saying I Hate You So Much - Sakshi
Sakshi News home page

Neha Chowdary Viral Post: నా భర్తను నేను ఎంతగానో ద్వేషిస్తున్నా.. 5 నిమిషాలు కూడా మాట మీద నిలబడడు..

Published Wed, Jul 12 2023 1:44 PM | Last Updated on Wed, Jul 12 2023 2:03 PM

Neha Choudery: I Hate You So Much Coz I Love You Beyond Anything in World - Sakshi

బిగ్‌బాస్‌ బ్యూటీ నేహా చౌదరి మల్టీ టాలెంటెడ్‌. మోడల్‌, యోగా ట్రైనర్‌, డ్యాన్సర్‌, స్విమ్మర్‌, జిమ్నాస్ట్‌, యాంకర్‌, అథ్లెట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది నేహా. ఇంట్లో పెళ్లి చేసుకోమని పోరు పెడుతుంటే నావల్ల కాదు బాబోయ్‌ అని బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌లో పాల్గొంది. ఈ షో ప్రారంభంలోనే ఎలిమినేట్‌ అయిన నేహా బిగ్‌బాస్‌ నుంచి బయటకు రాగానే ఏడడుగుల బంధంలో అడుగుపెట్టింది. తన చిన్ననాటి స్నేహితుడు అనిల్‌ను పెళ్లాడింది. బిగ్‌బాస్‌ 6 గ్రాండ్‌ ఫినాలే రోజే ఆమె పెళ్లిపీటలెక్కడం విశేషం.

తనను పెళ్లికూతురిగా ముస్తాబు చేశాక ఓసారి షోకి వచ్చి నాగార్జున ఆశీర్వాదాలు తీసుకుని మళ్లీ మండపానికి వెళ్లిపోయింది. ఇక సోషల్‌ మీడియాలో అప్పుడప్పుడు తన భర్తతో కలిసి చేసిన రీల్స్‌ వీడియోలు షేర్‌ చేస్తూ ఉంటుంది నేహా. తాజాగా తన భర్తను ద్వేషిస్తున్నానంటూ ఓ పోస్ట్‌ పెట్టింది. 'నిన్ను నేను ఎంతగానో ద్వేషిస్తున్నాను. ఎందుకంటే.. ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా నిన్నే ప్రేమిస్తున్నాను. అందుకే కాబోలు దీన్ని పెళ్లి అని పిలుస్తారు.

నువ్వు ఎంత పెద్దగా గురక పెట్టినా, నన్ను కారు నడపనివ్వకపోయినా, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్స్‌ నాకివ్వకుండా నువ్వొక్కడివే తినేసినా.. నేను చెప్పిన పని ఏదీ చేయకపోయినా ప్రేమిస్తూనే ఉంటాను. కానీ నువ్వు నాకు సారీ చెప్పి, ఇంకెప్పుడూ అలా నడుచుకోనని ఒట్టేస్తావు చూడు.. మాటిచ్చిన ఐదు నిమిషాల్లోనే మళ్లీ మళ్లీ అవే తప్పులు చేస్తావు. అయినా సరే.. నిన్ను చాలా.. చాలా... చాలా.... ప్రేమిస్తున్నాను. ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమించే విధానానికి నేను ఎప్పుడో ఫిదా అయ్యాను. నువ్వు ఎప్పటికీ నావాడివే' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టింది నేహా చౌదరి. దీనికి భర్తతో కలిసి దిగిన ఫోటో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది.

చదవండి: గ్లామర్‌ హీరోయిన్‌.. నటననే నమ్ముకున్న ఆమె చివరకు ఒళ్లు అమ్ముకుంది
పవన్‌ బ్రో విషయంలో థమన్‌ సీరియస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement