Bigg Boss 6 Telugu Grand Finale: Neha Chowdary Attends Finale Episode Ahead Of Her Marriage - Sakshi
Sakshi News home page

Neha Chowdary: విధి ఆడిన వింత నాటకంలో బలిపశువునయ్యా.. మరికాసేపట్లో పెళ్లి

Published Sun, Dec 18 2022 6:42 PM | Last Updated on Mon, Dec 19 2022 12:38 PM

Bride Neha Chowdary Attends Bigg Boss Telugu 6 Grand Finale - Sakshi

పెళ్లా? బిగ్‌బాస్‌ షోనా? అంటే బిగ్‌బాస్‌నే ఎంచుకుంది యాంకర్‌ నేహా చౌదరి. కానీ మూడో వారంలోనే ఎలిమినేట్‌ కావడంతో ఇంటిదారి పట్టింది. ఇక దొరికిందే ఛాన్స్‌ అనుకున్న ఆమె కుటుంబసభ్యులు నేడు ఆమె పెళ్లి చేసేస్తున్నారు. అయితే పెళ్లికూతురి గెటప్‌లోనే గ్రాండ్‌ ఫినాలేకి వచ్చేసింది నేహా చౌదరి. ఇంకో ఏడాదిదాకా పెళ్లిని వాయిదా వేద్దామనుకున్నా, కానీ తప్పలేదని చెప్పింది.

విధి ఆడిన వింత నాటకంలో బలిపశువు అయిపోయానని నేహా అనగానే బలిపశువు అయ్యేది నువ్వా? అతడా? అని నాగ్‌ కౌంటరిచ్చాడు. మీరు బిగ్‌బాస్‌ విన్నర్‌ ఎవరనేది ప్రకటించే సమయానికి నా మెడలో మూడు ముళ్లు పడనున్నాయని చెప్పుకొచ్చింది నేహా. పది గంటలకు నాకు పెళ్లైపోతుందని, నా బెస్ట్‌ ఫ్రెండ్‌ అనిల్‌నే పెళ్లాడబోతున్నానని తెలిపింది. దీంతో నాగ్‌ మరికొద్ది గంటల్లో కొత్త జీవితాన్ని ఆరంభించనున్న ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపాడు. ఇక అంత బిజీలోనూ నేహా గ్రాండ్‌ ఫినాలేకు రావడం గ్రేట్‌ అనే చెప్పాలి.

చదవండి: ఆదిరెడ్డి స్థానం మారింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement