బిగ్‌బాస్ సీజన్-6 కంటెస్టెంట్ నేహా చౌదరి పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా నేహానే వెల్లడించింది. అంతేకాకుండా కాబోయే భర్త ఫోటోను కూడా ఆడియెన్స్‌కు రివీల్ చేసింది. యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన నేహా చౌదరి బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన ఆమె రిథమిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలో జాతీయ స్థాయి చాంపియన్ సాధించింది.
అయితే ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఉన్న ఆసక్తితో బుల్లితెరపై అడుగుపెట్టి పలు పలు షోలకు యాంకరింగ్ చేసింది. ఇటీవలె బిగ్‌బాస్-6లో కూడా పాల్గొంది. ఇక ఈ షో ఎంట్రీ సమయంలో కూడా ‘బిగ్‌బాస్'కి వెళ్లొచ్చాక పెళ్లి చేసుకుంటా అని ఇంట్లో వాళ్లకి చెప్పి వచ్చాను’ అని కూడా వెల్లడించింది. అప్పుడు చెప్పినట్లే బిగ్‌బాస్ జర్నీ అనంతరం నేహా పెళ్లి చేసుకోబోతుంది. తన ఇంజనీరింగ్ క్లాస్‌మేట్ అయిన అనిల్ అనే వ్యక్తినే అతి త్వరలోనే పెళ్లాడబోతున్నట్లు నేహా తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment