
Neha Chowdary In Bigg Boss 6 Telugu: యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన నేహా చౌదరి బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఇచ్చిన ఆమె రిథమిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలో జాతీయ స్థాయి చాంపియన్ సాధించింది. అయితే ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఉన్న ఆసక్తితో బుల్లితెరపై అడుగుపెట్టి పలు పలు షోలకు యాంకరింగ్ చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ (ఐపీఎల్)లో యాంకర్‌గా నేహా చౌదరి మాంచి పాపులారిటీని దక్కించుకుంది. తెలుగుమ్మాయిగా బాంబే గడ్డపై యాంకరింగ్‌తో అలరించిన నేహా మరిప్పుడు బిగ్‌బాస్ షోలో ప్రేక్షకులను ఏ విధంగా మెప్పించనుంది అన్నది చూద్దాం.