Bigg Boss 6 Telugu: Neha Chowdary Shocking Comments About Her Elimination And Revanth - Sakshi
Sakshi News home page

Neha Chowdary: 'ఎలిమినేట్‌ అవుతానని అస్సలు ఊహించలేదు.. రేవంత్‌ వల్లే బయటికొచ్చా'

Published Mon, Sep 26 2022 12:55 PM | Last Updated on Mon, Sep 26 2022 1:49 PM

Bigg Boss Telugu 6 Neha Chowdary Comments After Elimination - Sakshi

బిగ్‌బాస్‌ సీజన్‌-6లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ అనుకున్న నేహా చౌదరి ఎలిమినేట్‌ అయ్యింది.ఇనయా, వాసంతిలలో ఎవరో ఒకరు ఎలిమినేట్‌ అవుతారని అంతా భావించారు. కానీ ఆర్జీవీ చేసిన ట్వీట్‌ మహత్యమా తెలీదు కానీ ఇనయా సేఫ్‌ అయ్యింది. చివరి రౌండ్‌లో వాసంతి, నేహాలకు మధ్య పోటీ జరగ్గా నేహా ఎలిమినేట్‌ కావడం  షాకింగ్‌ అనే చెప్పొచ్చు. అసలు గేమ్‌ పట్లు ఏమాత్రం సీరియస్‌నెస్‌ లేని కంటెస్టెంట్లు కూడా హౌస్‌లో ఉన్నా నేహా ఎలిమినేట్‌ కావడం పట్ల కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇక తాను ఎలిమినేట్‌ కావడంపై నేహా చౌదరి కూడా షాక్‌ అయ్యింది.నమ్మినవాళ్లే ఇలా చేశారని, ముఖ్యంగా రేవంత్‌ వల్లే తాను బయలికి వచ్చేశానని పేర్కొంది.  తాను ఎలిమినేట్‌ అవుతానని అస్సలు ఊహించలేదని, చాలా షాకింగ్‌గా అనిపిస్తుందని తెలిపింది. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అసహనాన్ని బయటపెట్టింది.

తాను ఎందుకు బయటికి వచ్చానో తెలియడం లేదని, తనకంటే అసలు గేమ్‌ ఆడని వాళ్లు కూడా హౌస్‌లో ఉన్నారని చెప్పింది. అంతేకాకుండా వైల్డ్‌ కార్డ్‌ రూపంలో మరోసారి బిగ్‌బాస్‌లోకి వెళ్లే ఛాన్స్‌ వస్తే తప్పకుండా వెళ్తానని, అసలు రివేంజ్‌ తీసుకోవాల్సిన వాళ్లు చాలామంది ఉన్నారని పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement