Bigg Boss6 Telugu Episode 10: నామినేషన్‌లో చేసిన ఆరోపణలపై ఇంటి సభ్యులంతా వివరణ ఇచ్చుకున్నారు. అర్జున్ కల్యాణ్ వచ్చి శ్రీసత్యతో రేవంత్ చేసిన కామెడీపై చర్చించారు. అమ్మాయిలతో అలా ముడిపెట్టి కామెంట్ చేయడం నచ్చలేదని, అందుకే రేవంత్‌ని నామినేట్ చేశానని కల్యాణ్ చెప్పాడు. ఇక గీతూ, ఆదిరెడ్డిలు గేమ్ ప్లాన్ గురించి మాట్లాడుకున్నారు. ‘నామినేషన్స్ తర్వాత సేవ్ అవ్వడానికి ట్రై చేయడం కన్నా..నామినేషన్స్‌లో ఉన్నప్పుడే నిన్ను నువ్వు సేవ్ చేసుకోచ్చు తెలుసా? అంటూ ఆదిరెడ్డికి ఉచిత సలహా ఇచ్చింది గీతూ. నామినేషన్స్‌లో నీకంటే వీక్‌గా ఉన్న కంటెస్టెంట్స్‌ని నామినేట్ చేస్తే.. వాళ్లు బయటకు వెళ్లే చాన్స్ ఉంటుందని గీతూ చెప్పుకొచ్చింది. రాజశేఖర్, ఇనయా సుల్తానా లాంటి వాళ్లను నామినేట్ చేస్తే మనం సేవ్ అవుతామని చెప్పింది. అయితే ఆదిరెడ్డి మాత్రం అన్నం తింటూ... గీతూ చెప్పింది విని వినట్టుగా ‘ఊ’కొట్టాడు అంతే.
మరోవైపు బాలాదిత్య .. రేవంత్‌కి క్లాస్ తీసుకున్నాడు. నామినేషన్‌లో హైపర్ అవుతున్నామని, అది తగ్గించుకోవాలని చెప్పాడు. ‘ఒక మనిషి నీతో మాట్లాడడానికి సంకోచించాడు అంటే.. నీ సైడ్ నుంచి ఎక్కడో చిన్న పొరపాటు ఉన్నట్లే కదా? ఒకరిద్దరు చెప్తే వాళ్లది తప్పు కావొచ్చు, కానీ ఐదారుగురు చెప్పారంటే నీ సైడ్ తప్పు ఉండే అవకాశం ఉంది కదా? ఇప్పటికీ మించి పోయిందేమి లేదు. నువ్వు చర్చించినకొద్ది ఇంకా హైపర్ అయిపోతున్నావ్, కోపం వచ్చేస్తుంది.. అందుకే ఎక్కువగా చర్చించకు’అని రేవంత్‌కు హితబోధ చేశాడు బాలాదిత్య.
ఇక ఆర్జే సూర్య, ఆరోహి..బాలాదిత్య గురించి మాట్లాడుకున్నారు. పట్టుకుందాం అంటే ఒక్క పాయింట్‌లో కూడా దొరకడం లేదని ఆరోహి అంటే.. దొరుకుతాడు దొరుకుతాడు అని సూర్య అన్నాడు. ఆదిరెడ్డి నామినేషన్స్‌లో నీకు సాలిడ్ కౌంటర్ ఇచ్చాడని ఆరోహితో చెప్పాడు సూర్య. దానికి ఆరోహి అవును. నేను కూడా ఏం మాట్లాడలేకపోయానని చెప్పింది. ‘ఈ హౌస్‌లో మనిద్దరమే ఫ్రెండ్స్ ఉన్నాం కాబట్టి.. మనం కలసి ఆడుతున్నామనే మాట వస్తుంది. దానికి కూడా రెడీ అయ్యిండాలి’ అని ఆరోహితో చెప్పాడు ఆర్జే సూర్య.
ఇక ఉదయాన్నే ముద్దులతో హల్‌చల్ చేసింది రోహిత్ మెరీనా జంట. బెడ్‌రూంలో ఇద్దరు హద్దులు మీరి ముద్దులు పెట్టుకున్నారు. కెమెరా ఉందని తెలిసినా.. కావాలనే కంటెంట్ కోసం వాళ్లు రొమాన్స్ చేశారు. పక్కనే ఉన్న నేహ చౌదరిని ‘చూసింది చాల్లే.. మేము రొమాన్స్ చేసుకోవాలి.. నువ్ వెళ్లిరా’అని మెరీనా అనడంతో.. నాక్కుడా వెంటనే పెళ్లి చేసుకోవాలని ఉంది అని అనేసింది నేహా. ఇక శ్రీ సత్య అయితే అందరితో కూర్చుని తినడం తన వల్ల కాదని.. నాకు నచ్చింది చేయడానికి ఇక్కడకు వచ్చాను తప్పితే.. అందరికీ నచ్చింది చేయడానికి రాలేదని చెప్పింది.
ఆ తరువాత రెండోవారం కెప్టెన్సీ టాస్క్ ప్రారంభం అయ్యింది. దాని పేరే సిసింద్రీ. ఈ టాస్క్‌లో భాగంగా ప్రతి ఇంటి సభ్యులకు ఒక బేబీ బొమ్మను ఇస్తారు. ఇంటి సభ్యులందరూ తమ బేబీ బాగోగులు చూసుకుంటూ టాస్క్‌లో సమయానుసారం బిగ్‌బాస్ ఇచ్చే చాలెంజెస్‌లలో పాల్గొనాలి.
బజర్ మోగినప్పుడల్లా ఏ ఐదుగురు సభ్యులైతే ముందుగా వారి బేబీస్‌ని గార్డెన్ ఏరియాలో ఉన్న చైర్‌లో ఉంచుతారో వారు మాత్రమే బిగ్‌బాస్ ఇచ్చే చాలెంజెస్‌లో పాల్గొనాలి. ప్రతి చాలెంజ్‌లో గెలిసిన సభ్యలు కెప్టెన్సీ పోటీదారులు అవుతారు. టాస్క్ సమయంలో బేబీ బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత వారిదే. ఆ సమయంలో బేబీస్ మీ దగ్గర కాకుండా.. లాస్ట్ అండ్ పౌండ్ ఏరియాలో లభిస్తే కెప్టెన్సీ పోటీదారులు అయ్యే అవకాశాన్ని కోల్పోతారు. ఏ ఇంటి సభ్యులైనా బేబీని ఇంట్లో ఒంటరిగా వదిలేస్తే.. వారిని కెప్టెన్సీ పోటీదారుల నుంచి తప్పించడానికి మిగతా సభ్యులు ఆ బేబీని లాస్ట్ అండ్ పౌండ్ ఏరియాలో పెట్టవచ్చు’అని బిగ్‌బాస్ చెప్పాడు. ఇక బిగ్‌బాస్ ఇచ్చిన మొదటి చాలెంజెస్‌లో ఆరోహి, చంటి, రేవంత్, ఫైమా, గీతూ పాల్గొనగా.. చంటి విజయం సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment