Merina
-
Bigg Boss 6: షాకింగ్ ట్విస్ట్.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్..ఆ ఇద్దరు ఔట్
బిగ్‌బాస్ హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. ముఖ్యంగా ఎలిమినేషన్ విషయంలో గత రెండు వారాలుగా షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నాడు బిగ్‌బాస్. ఎనిమిదో వారంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న సూర్య ఎలిమినేట్ చేయగా..తొమ్మిదో వారంలో ఎవరూ ఊహించని విధంగా గీతూని బయటకు పంపారు. ఇక పదో వారంలో కూడా ప్రేక్షకులకు భారీ షాక్ ఇవ్వబోతున్నాడట బిగ్‌బాస్. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందట. ఈ ఎలిమినేషన్‌కు సంబంధించిన షూటింగ్ శుక్రవారమే పూర్తవ్వడంతో.. ఎప్పటి మాదిరే ఈ వారం కూడా ఎలిమినేట్ అయినవారి పేర్లు బయటకు వచ్చాయి. ఈవారం ఎలిమినేషన్లో ఇనయా, కీర్తి, ఫైమా, వాసంతి, బాలాదిత్య, మెరీనా, రేవంత్, ఆదిరెడ్డి, శ్రీహాన్ మొత్తం 9మంది ఉన్నారు. వీరిలో నుంచి బాలాదిత్య, మెరీనా ఈ వారం ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఓటింగ్ లీస్ట్ లో బాలాదిత్య లాస్ట్‌లో ఉండగా.. మెరీనాను కూడా హౌజ్ నుంచి పంపించేందుకే డబుల్ ఎలిమినేషన్ పెట్టినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బిగ్‌బాస్ హౌస్‌లో బాలాదిత్య, మెరీనాకు మంచి పేరు ఉంది. వివాదాలకు దూరంగా ఉంటూ.. గేమ్‌ని గేమ్‌గానే ఆడారు. తమదైన ఆటతో తీరుతోప్రేక్షకుల్ని మెప్పించారు. ఒక్క సిగరేట్ల విషయంతో తప్పితే బాలాదిత్య విషయంలో నెగెటివ్ అనేదే లేదు. ఇక మెరీనాకి అయితే ఇన్ అండ్ ఔట్ క్లీన్ ఇమేజ్ ఉంది. మంచితనమే వీరికి మైనస్ అయినట్లు తెలుస్తుంది. -
Bigg Boss 6: కెమెరా ముందు రోహిత్, మెరీనా రొమాన్స్.. ‘చూసింది చాల్లే పో’
Bigg Boss6 Telugu Episode 10: నామినేషన్లో చేసిన ఆరోపణలపై ఇంటి సభ్యులంతా వివరణ ఇచ్చుకున్నారు. అర్జున్ కల్యాణ్ వచ్చి శ్రీసత్యతో రేవంత్ చేసిన కామెడీపై చర్చించారు. అమ్మాయిలతో అలా ముడిపెట్టి కామెంట్ చేయడం నచ్చలేదని, అందుకే రేవంత్‌ని నామినేట్ చేశానని కల్యాణ్ చెప్పాడు. ఇక గీతూ, ఆదిరెడ్డిలు గేమ్ ప్లాన్ గురించి మాట్లాడుకున్నారు. ‘నామినేషన్స్ తర్వాత సేవ్ అవ్వడానికి ట్రై చేయడం కన్నా..నామినేషన్స్‌లో ఉన్నప్పుడే నిన్ను నువ్వు సేవ్ చేసుకోచ్చు తెలుసా? అంటూ ఆదిరెడ్డికి ఉచిత సలహా ఇచ్చింది గీతూ. నామినేషన్స్‌లో నీకంటే వీక్‌గా ఉన్న కంటెస్టెంట్స్‌ని నామినేట్ చేస్తే.. వాళ్లు బయటకు వెళ్లే చాన్స్ ఉంటుందని గీతూ చెప్పుకొచ్చింది. రాజశేఖర్, ఇనయా సుల్తానా లాంటి వాళ్లను నామినేట్ చేస్తే మనం సేవ్ అవుతామని చెప్పింది. అయితే ఆదిరెడ్డి మాత్రం అన్నం తింటూ... గీతూ చెప్పింది విని వినట్టుగా ‘ఊ’కొట్టాడు అంతే. మరోవైపు బాలాదిత్య .. రేవంత్‌కి క్లాస్ తీసుకున్నాడు. నామినేషన్లో హైపర్ అవుతున్నామని, అది తగ్గించుకోవాలని చెప్పాడు. ‘ఒక మనిషి నీతో మాట్లాడడానికి సంకోచించాడు అంటే.. నీ సైడ్ నుంచి ఎక్కడో చిన్న పొరపాటు ఉన్నట్లే కదా? ఒకరిద్దరు చెప్తే వాళ్లది తప్పు కావొచ్చు, కానీ ఐదారుగురు చెప్పారంటే నీ సైడ్ తప్పు ఉండే అవకాశం ఉంది కదా? ఇప్పటికీ మించి పోయిందేమి లేదు. నువ్వు చర్చించినకొద్ది ఇంకా హైపర్ అయిపోతున్నావ్, కోపం వచ్చేస్తుంది.. అందుకే ఎక్కువగా చర్చించకు’అని రేవంత్‌కు హితబోధ చేశాడు బాలాదిత్య. ఇక ఆర్జే సూర్య, ఆరోహి..బాలాదిత్య గురించి మాట్లాడుకున్నారు. పట్టుకుందాం అంటే ఒక్క పాయింట్లో కూడా దొరకడం లేదని ఆరోహి అంటే.. దొరుకుతాడు దొరుకుతాడు అని సూర్య అన్నాడు. ఆదిరెడ్డి నామినేషన్స్‌లో నీకు సాలిడ్ కౌంటర్ ఇచ్చాడని ఆరోహితో చెప్పాడు సూర్య. దానికి ఆరోహి అవును. నేను కూడా ఏం మాట్లాడలేకపోయానని చెప్పింది. ‘ఈ హౌస్‌లో మనిద్దరమే ఫ్రెండ్స్ ఉన్నాం కాబట్టి.. మనం కలసి ఆడుతున్నామనే మాట వస్తుంది. దానికి కూడా రెడీ అయ్యిండాలి’ అని ఆరోహితో చెప్పాడు ఆర్జే సూర్య. ఇక ఉదయాన్నే ముద్దులతో హల్చల్ చేసింది రోహిత్ మెరీనా జంట. బెడ్రూంలో ఇద్దరు హద్దులు మీరి ముద్దులు పెట్టుకున్నారు. కెమెరా ఉందని తెలిసినా.. కావాలనే కంటెంట్ కోసం వాళ్లు రొమాన్స్ చేశారు. పక్కనే ఉన్న నేహ చౌదరిని ‘చూసింది చాల్లే.. మేము రొమాన్స్ చేసుకోవాలి.. నువ్ వెళ్లిరా’అని మెరీనా అనడంతో.. నాక్కుడా వెంటనే పెళ్లి చేసుకోవాలని ఉంది అని అనేసింది నేహా. ఇక శ్రీ సత్య అయితే అందరితో కూర్చుని తినడం తన వల్ల కాదని.. నాకు నచ్చింది చేయడానికి ఇక్కడకు వచ్చాను తప్పితే.. అందరికీ నచ్చింది చేయడానికి రాలేదని చెప్పింది. ఆ తరువాత రెండోవారం కెప్టెన్సీ టాస్క్ ప్రారంభం అయ్యింది. దాని పేరే సిసింద్రీ. ఈ టాస్క్‌లో భాగంగా ప్రతి ఇంటి సభ్యులకు ఒక బేబీ బొమ్మను ఇస్తారు. ఇంటి సభ్యులందరూ తమ బేబీ బాగోగులు చూసుకుంటూ టాస్క్‌లో సమయానుసారం బిగ్‌బాస్ ఇచ్చే చాలెంజెస్లలో పాల్గొనాలి. బజర్ మోగినప్పుడల్లా ఏ ఐదుగురు సభ్యులైతే ముందుగా వారి బేబీస్‌ని గార్డెన్ ఏరియాలో ఉన్న చైర్లో ఉంచుతారో వారు మాత్రమే బిగ్‌బాస్ ఇచ్చే చాలెంజెస్‌లో పాల్గొనాలి. ప్రతి చాలెంజ్‌లో గెలిసిన సభ్యలు కెప్టెన్సీ పోటీదారులు అవుతారు. టాస్క్ సమయంలో బేబీ బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత వారిదే. ఆ సమయంలో బేబీస్ మీ దగ్గర కాకుండా.. లాస్ట్ అండ్ పౌండ్ ఏరియాలో లభిస్తే కెప్టెన్సీ పోటీదారులు అయ్యే అవకాశాన్ని కోల్పోతారు. ఏ ఇంటి సభ్యులైనా బేబీని ఇంట్లో ఒంటరిగా వదిలేస్తే.. వారిని కెప్టెన్సీ పోటీదారుల నుంచి తప్పించడానికి మిగతా సభ్యులు ఆ బేబీని లాస్ట్ అండ్ పౌండ్ ఏరియాలో పెట్టవచ్చు’అని బిగ్‌బాస్ చెప్పాడు. ఇక బిగ్‌బాస్ ఇచ్చిన మొదటి చాలెంజెస్‌లో ఆరోహి, చంటి, రేవంత్, ఫైమా, గీతూ పాల్గొనగా.. చంటి విజయం సాధించాడు. -
బిగ్‌బాస్ హౌస్‌లో భార్యభర్తల కొట్లాట.. వీళ్లేం రొమాంటిక్ కపుల్ రా బాబూ!
బిగ్‌బాస్ హౌస్‌లోకి క్యూట్ కపుల్‌గా ఎంట్రీ ఇచ్చారు మెరీనా అండ్ రోహిత్. అంతకు ముందు సీజన్ 3లో హీరో రో వరుణ్ సందేశ్, వితికలు భార్యభర్తలుగా హౌస్‌లోకి వచ్చారు. కొన్ని విషయాల్లో వారిద్దరే గొడవపడేవారు. అయితే తొలి రెండు వారాలు మాత్రం ఇద్దరు చాలా క్లోజ్‌గా ఉంటూ కపుల్ అంటే ఇలా ఉండాలి అనేలా ప్రవర్తించారు. కానీ మెరీనా, రోహిత్ జంట మాత్రం తొలివారంలోనే గొడవలకు దిగారు. (చదవండి: నామినేషన్స్‌లో ఆ ముగ్గురు, బయటకు వెళ్లేది ఆవిడే!) బిగ్‌బాస్ వేదికపై నాగార్జున అడిగిన ప్రశ్నలకు ఇద్దరు సింక్ అయ్యేలా సమాధానం చేప్పడంతో వీరిద్దరి మధ్య ఎంతో అవగాహన ఉందని అంతా భావించారు. కానీ హౌస్‌లోకి వెళ్లగానే వారి ప్రవర్తనలో మార్పు మొదలైంది. ఒకరినొకరు విసుక్కోవడం ప్రారంభించారు. వాష్ రూమ్ దగ్గర గీతూ గురించి రోహిత్‌కి ఏదో చెప్పబోయింది మెరీనా. ఆ సమయంలో రోహిత్ అద్దంలో తన బాడీని చూసుకుంటూ ఆమె మాటలను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో మెరీనా హర్ట్ అయింది. ‘నువ్వు ముందు నీ బాడీ అయినా చూసుకో లేదంటే నేను చెప్పేదైనా విను’ అని విసుక్కుంది. అప్పుడు రోహిత్.. ఓకే ఇప్పుడు చెప్పు అన్నాడు. కానీ అప్పటికే కోపం తెచ్చుకున్న మెరీనా నేను చెప్పనంటూ అక్కడ నుంచి వెళ్లేందుకు ప్రయత్నించింది. దీంతొ రోహిత్.. ఓవర్ యాక్షన్ చేయకంటూ ఆమెపై కోపం ప్రదర్శించాడు. మెరీనా మాత్రం నేను ఏం చెప్పినా కళ్లల్లోకి కళ్లు పెట్టి వినాలి. వినడం ఇష్టంలేకుంటే నాకు ఇప్పుడు మూడ్ లేదు తర్వాత వింటా అని చెప్పాలి కానీ ఇలా చేయడం నాకు నచ్చలేదంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉన్న జంటగా బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిన మెరీనా, రోహిత్.. మూడో రోజే ఇలా గొడవపడటంతో ‘వీళ్లేం రొమాంటిక్ కపుల్ రా బాబూ’అని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. -
‘మెరీనా’చిత్రం మనసుంటే నచ్చుతుంది
‘‘ఈ చిత్రంలో భారీ పోరాటాలు ఉండవు. చాలా చిన్న సినిమా. కానీ విడుదలైన తర్వాత పెద్ద సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు శోభారాణి. దశావతారం, సూర్య సన్నాఫ్ కృష్ణన్, తుపాకీ తదితర చిత్రాలను విడుదల చేసిన శోభారాణి తాజాగా తమిళ చిత్రం ‘మెరీనా’ని అదే పేరుతో తెలుగులోకి అందిస్తున్నారు. 15న ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా శోభారాణి మాట్లాడుతూ - ‘‘తమిళంలో చిన్న చిత్రంగా విడుదలై ఘనవిజయం సాధించింది. మెరీనా బీచ్‌లో తినుబండారాలు అమ్ముకునే పిల్లలు, పెద్దల జీవితం ఆధారంగా దర్శకుడు పాండిరాజ్ ఈ సినిమా తీశారు. వారి జీవితం తాలూకు ఒడిదుడుకులతో పాటు ఓ ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ప్రతి ఒక్కరికీ చదువు ముఖ్యం అని అంతర్లీనంగా సందేశం కూడా ఉంది. స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ సినిమా ఇది. మంచి కథ, ఆహ్లాదకరమైన పాటలతో సాగే ఈ చిత్రం మనసున్న ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది’’ అని చెప్పారు.