‘మెరీనా’చిత్రం మనసుంటే నచ్చుతుంది | Merina Movie attract everyone | Sakshi
Sakshi News home page

‘మెరీనా’చిత్రం మనసుంటే నచ్చుతుంది

Published Tue, Aug 13 2013 1:38 AM | Last Updated on Fri, Sep 1 2017 9:48 PM

‘మెరీనా’చిత్రం మనసుంటే నచ్చుతుంది

‘మెరీనా’చిత్రం మనసుంటే నచ్చుతుంది

 ‘‘ఈ చిత్రంలో భారీ పోరాటాలు ఉండవు. చాలా చిన్న సినిమా.  కానీ విడుదలైన తర్వాత పెద్ద సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు శోభారాణి. దశావతారం, సూర్య సన్నాఫ్ కృష్ణన్, తుపాకీ తదితర చిత్రాలను విడుదల చేసిన శోభారాణి తాజాగా తమిళ చిత్రం ‘మెరీనా’ని అదే పేరుతో తెలుగులోకి అందిస్తున్నారు. 
 
 15న ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా శోభారాణి మాట్లాడుతూ - ‘‘తమిళంలో చిన్న చిత్రంగా విడుదలై ఘనవిజయం సాధించింది. మెరీనా బీచ్‌లో తినుబండారాలు అమ్ముకునే పిల్లలు, పెద్దల జీవితం ఆధారంగా దర్శకుడు పాండిరాజ్ ఈ సినిమా తీశారు. 
 
వారి జీవితం తాలూకు ఒడిదుడుకులతో పాటు ఓ ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ప్రతి ఒక్కరికీ చదువు ముఖ్యం అని అంతర్లీనంగా సందేశం కూడా ఉంది.  స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ సినిమా ఇది. మంచి కథ, ఆహ్లాదకరమైన పాటలతో సాగే ఈ చిత్రం మనసున్న ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది’’ అని చెప్పారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement