Bigg Boss 6 Telugu: Cute Couple Marina Abraham And Rohit Sahni Starts Fighting In BB House - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్‌ హౌస్‌లో మొగుడు పెళ్లాల కొట్లాట.. వీళ్లేం రొమాంటిక్‌ కపుల్‌ రా బాబూ!

Sep 7 2022 11:36 AM | Updated on Sep 8 2022 6:11 PM

Bigg Boss 6 Telugu: Cute Couple Rohit And Marina Starts Fighting In BB House - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి క్యూట్‌ ‍కపుల్‌గా ఎంట్రీ ఇచ్చారు మెరీనా అండ్‌ రోహిత్‌. అంతకు ముందు సీజన్‌ 3లో హీరో రో వరుణ్ సందేశ్, వితికలు భార్యభర్తలుగా హౌస్‌లోకి వచ్చారు. కొన్ని విషయాల్లో వారిద్దరే గొడవపడేవారు. అయితే తొలి రెండు వారాలు మాత్రం ఇద్దరు చాలా క్లోజ్‌గా ఉంటూ కపుల్‌ అంటే ఇలా ఉండాలి అనేలా ప్రవర్తించారు. కానీ మెరీనా, రోహిత్‌ జంట మాత్రం తొలివారంలోనే గొడవలకు దిగారు.
(చదవండి: నామినేషన్స్‌లో ఆ ముగ్గురు, బయటకు వెళ్లేది ఆవిడే!)

బిగ్‌బాస్‌ వేదికపై నాగార్జున అడిగిన ప్రశ్నలకు ఇద్దరు సింక్ అయ్యేలా సమాధానం చేప్పడంతో వీరిద్దరి మధ్య ఎంతో అవగాహన ఉందని అంతా భావించారు. కానీ హౌస్‌లోకి వెళ్లగానే వారి ప్రవర్తనలో మార్పు మొదలైంది. ఒకరినొకరు విసుక్కోవడం ప్రారంభించారు. వాష్‌ రూమ్‌ దగ్గర గీతూ గురించి రోహిత్‌కి ఏదో చెప్పబోయింది మెరీనా. ఆ సమయంలో రోహిత్‌ అద్దంలో తన బాడీని చూసుకుంటూ ఆమె మాటలను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో మెరీనా హర్ట్‌ అయింది.  

‘నువ్వు ముందు నీ బాడీ అయినా చూసుకో లేదంటే నేను చెప్పేదైనా విను’ అని విసుక్కుంది. అప్పుడు రోహిత్.. ఓకే ఇప్పుడు చెప్పు అన్నాడు. కానీ అప్పటికే కోపం తెచ్చుకున్న మెరీనా నేను చెప్పనంటూ అక్కడ నుంచి వెళ్లేందుకు ప్రయత్నించింది. దీంతొ రోహిత్.. ఓవర్ యాక్షన్ చేయకంటూ  ఆమెపై కోపం ప్రదర్శించాడు. మెరీనా మాత్రం నేను ఏం చెప్పినా కళ్లల్లోకి కళ్లు పెట్టి వినాలి. వినడం ఇష్టంలేకుంటే నాకు ఇప్పుడు మూడ్‌ లేదు తర్వాత వింటా అని చెప్పాలి కానీ ఇలా చేయడం నాకు నచ్చలేదంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉన్న జంటగా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లిన మెరీనా, రోహిత్‌.. మూడో రోజే ఇలా గొడవపడటంతో ‘వీళ్లేం రొమాంటిక్‌ కపుల్‌ రా బాబూ’అని నెటిజన్స్‌ ట్రోల్‌ చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement