
ఢిల్లీ: ఈ ఐపీఎల్ సీజన్‌లో ఎంఎస్ ధోని పరుగులు తీయడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచుల్లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. ధోని పేలవ బ్యాటింగ్ ప్రదర్శన చెన్నై జట్టును కలవరపెడుతుంది. ఈ విషయమై వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా మాట్లాడారు. 'ధోని అద్భుతమైన 'ఫినిషర్', అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు అతడికి అనుకూలంగా లేవు. ఛేదనలో మునుపటి ధోనిలా ఆడలేకపోతున్నాడు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 11(12) పరుగులే చేయగలిగాడు. ఆ మ్యాచ్‌లో జడేజా బాగా ఆడాడు. డ్వేన్ బ్రావోకు కూడా ఆ జట్టులో సరైన అవకాశం లభించడం లేదు. ఫినిషింగ్ బాధ్యతలు వేరొకరికి ఇస్తే బాగుంటుంది' అని లారా అభిప్రాయపడ్డారు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. కోల్‌కతా నిర్దేశించిన 167 పరుగుల లక్ష్య ఛేదనలో సీఎస్‌కే 'మిడిల్ ఆర్డర్' పూర్తిగా విఫలమైంది. నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 157 పరుగులే చేయగలిగింది.
(ఇదీ చదవండి: నేను రన్స్ ఇవ్వడం కాదు.. వారు కొడుతున్నారు!)
Comments
Please login to add a commentAdd a comment