వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23 విజేతగా పాట్ కమ్మిన్స్ సారధ్యంలోని ఆస్ట్రేలియా నిలిచిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌లోని ఓవల్ వేదికగా జరిగిన ఫైనల్లో 209 పరుగుల తేడాతో టీమిండియాను చిత్తు చేసిన ఆస్ట్రేలియా విశ్వవిజేతగా నిలిచింది. మరోవైపు ఐసీసీ టైటిల్ సాధించి పదేళ్ల నిరీక్షణకు తెరదించాలని ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన రోహిత్ సేనకు మాత్రం తీవ్ర నిరాశే మిగిలింది.
అంతకుముందు 2021లో ఇదే ఇంగ్లండ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా భారత జట్టు ఓటమి చవిచూసింది. కాగా డబ్ల్యూటీసీ-2025 కూడా ఇంగ్లండ్‌లోనే జరగనుండడం గమనార్హం. అయితే ఈ చాంపియన్‌షిప్ ఫైనల్‌ను కేవలం ఇంగ్లండ్‌లోనే నిర్వహించడం సరికాదని పలువరు మాజీలు మొదటి నుంచే అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాస్త ఆసహనం వ్యక్తం చేశాడు.
ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. "ఫైనల్‌కు ఇంగ్లండ్‌లోనే నిర్వహించాలనే రూల్ కూడా ఏం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఈ మ్యాచ్ నిర్వహించవచ్చు. అది కూడా జూన్‌లోనే షెడ్యూల్ చేయాలని లేదు కాదా. సీసీ ట్రోఫీ గెలవడం కంటే గొప్ప విషయం మరొకటి ఉండదు.
ఈ ఓటమితో జట్టులో ఉన్న ప్రతీ ఒక్కరు తీవ్ర నిరాశకు గురయ్యారు" అని అన్నాడు. తాజాగా రోహిత్ వాఖ్యలతో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా కూడా ఎకీభవించాడు. తదుపరి డబ్ల్యూటీసీ ఫైనల్‌ను తన స్వదేశం బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో నిర్వహించాలని లారా అభిప్రాయపడ్డాడు.
"డబ్ల్యూటీసీ-2025ను బార్బడోస్‌లో నిర్వహించాలని నేను భావిస్తున్నాను. అది కూడా జూన్‌లో కాకుండా మార్చిలో జరగాలి. ఫైనల్‌కు చేరే రెండు జట్ల ఐస్‌లాండ్స్ అందాలను ఆస్వాదించాలని" ఓ యూజర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు లారా రిప్లే ఇచ్చాడు. ఇక డబ్ల్యూటీసీ (2023–25) సైకిల్‌లో భాగంగా భారత జట్టు తమ తొలి సిరీస్‌లో వెస్టిండీస్‌తో తలపడనుంది. విండీస్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ భారత్ ఆడనుంది. ఇరు జట్ల మధ్య జులై 12–16 మధ్య తొలి టెస్టు (డొమినికాలో), జులై 20–24 మధ్య రెండో టెస్టు (ట్రినిడాడ్)లో జరుగుతాయి.
చదవండి: #RAshwin: బాధ కలిగిన మాట నిజమే..
Comments
Please login to add a commentAdd a comment