
ఢిల్లీ : కరోనా వైరస్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ తన కొడుకు జొరావర్‌తో తెగ అల్లరి చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ నేపథ్యంలో ఆటకు విరామం దొరకడంతో భార్య అయేషాతో కలిసి బాక్సింగ్ క్లాసులు నేర్చుకోవడం, పలు బాలీవుడ్ గీతాలకు డ్యాన్స్‌లు చేస్తున్నాడు. దొరికిన ప్రతీ మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తున్న ఈ గబ్బర్ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నాడు. ('ఆ నిర్ణయం నా కెరీర్‌ను ముంచేసింది')
తాజాగా ఈ మధ్యనే టిక్‌టాక్‌లో యమక్రేజ్‌గా మారిన 'సైరన్ బీట్ చాలెంజ్' డ్యాన్స్‌ను ధవన్ ట్రై చేశాడు. అయితే ధావన్ సీరియస్‌గా స్టార్ట్ చేద్దామనుకున్న ప్రతీసారి జొరావర్ అడ్డుగా వచ్చాడు. సైరన్ బీట్‌కు సంబంధించి రెండు స్టెప్స్ వేసిన ధావన్ తన కొడుకు జొరావర్ మరోసారి మధ్యలో రావడంతో కొడుకుతో కలిసి సంప్రదాయ పంజాబీ డ్యాన్స్‌ను చేశాడు. దాంతో ఈ వీడియోలో జొరావర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారాడు.' డ్యాన్స్‌కీ అసలీ జోడి లైక్ ఫాదర్, లైక్ సన్' అంటూ క్యాప్షన్ జతచేశాడు. ఈ వీడియోపై ధావన్ అభిమానులతో పాటు విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా లాఫింగ్ ఎమోజీతో తన ఇన్‌స్టాలో స్పందించగా.. మిగతా టీమిండియా బ్యాట్స్‌మెన్‌లు కూడా ఎమోజీలతో కామెంట్లు పెట్టారు. ధావన్ అభిమానులు మాత్రం.. ' అబ్బా.. కొడుకు కలిసి డ్యాన్స్ ఇరగదీశారు'..' గబ్బర్ నువ్వుంటే చాలా అభిమానం.. ' అంటూ కామెంట్లు చేశారు.
('తండ్రిగా నా కోరికలు నెరవేర్చుకుంటున్నా')
Comments
Please login to add a commentAdd a comment