
లారా రికార్డును సచిన్ బ్రేక్ చేయాలంటున్న బ్యాట్ వాలా
టీమిండియా బ్యాటింగ్ గ్రేట్ ఎన్నో రికార్డులు కొల్లగొట్టాడు. ఎందరో దిగ్గజాలకు సాధ్యంకానివి సైతం సాకారం చేసుకున్నాడు.
టీమిండియా బ్యాటింగ్ గ్రేట్ సచిన్ ఎన్నో రికార్డులు కొల్లగొట్టాడు. ఎందరో దిగ్గజాలకు సాధ్యంకానివి సైతం సాకారం చేసుకున్నాడు. 24 ఏళ్లు సుదీర్ఘ కెరీర్ కొనసాగించిన మాస్టర్ త్వరలో క్రికెట్కు వీడ్కోలు కూడా పలకనున్నాడు. అయితే సచిన్కు ఓ రికార్డు కలగానే మిగిలిపోయింది. అదే వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియన్ లారా (400) పేరిట ఉన్న అత్యధిక స్కోరు. ముంబైకర్ మరో రెండు టెస్టులు మాత్రమే ఆడనున్నాడు. లారా రికార్డు బద్దలు కొట్టడం సాధ్యమేనా..?
మాస్టర్ కోసం 20కి పైగా బ్యాట్లను సిద్ధం చేసిన రామ్ భండారి.. సచిన్ లారా రికార్డును బ్రేక్ చేయాలని ఎదురు చూస్తున్నాడు. మాస్టర్ కెరీర్కు గుడ్ బై చెప్పే లోపు ఇది కూడా సాధించాలని చెప్పాడు. 'సచిన్ (400) రికార్డు బద్దలు కొట్టాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నా. భారతీయులందరూ గర్విస్తారు' అని భండారి అన్నాడు. ఐతే సచిన్ ప్రస్తుత దశలో ఈ రికార్డు నెలకొల్పడం కష్టమేనని చెప్పాడు. వెస్టిండీస్తో రెండు టెస్టుల సిరీసే ముంబైకర్కు చివరిది. వాంఖడేలో జరిగే రెండో మ్యాచ్లో కెరీర్కు వీడ్కోలు పలకనున్నాడు.