
రోహిత్ రికార్డును బ్రేక్ చేయడం కష్టం: లారా
భారత బ్యాట్స్మన్ రోహిత్ శర్మ వన్డేల్లో సృష్టించిన ప్రపంచ రికార్డును అధిగమించడం కష్టమని వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియన్ లారా అభిప్రాయపడ్డాడు.
మెల్ బోర్న్: భారత బ్యాట్స్మన్ రోహిత్ శర్మ వన్డేల్లో సృష్టించిన ప్రపంచ రికార్డును అధిగమించడం కష్టమని వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియన్ లారా అభిప్రాయపడ్డాడు. గతవారం శ్రీలంకతో జరిగిన వన్డేలో రోహిత్ శర్మ 264 పరుగులు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సెహ్వాగ్(219) పేరిట ఉన్న రికార్డును అతడు అధిగమించాడు.
మాంచెస్టర్ లో ఇంగ్లండ్ మీద సర్ వివి రిచర్డ్స్ చేసిన 189 పరుగుల ఇన్నింగ్స్ చూస్తూ తాము పెరిగామని లారా తెలిపాడు. తర్వాత ఈ రికార్డు చెరిగిపోయిందన్నాడు. వన్డేలో డబుల్ సెంచరీ సాధించడం సాధ్యమే అయినప్పటికీ రోహిత్ శర్మ సాధించిన రికార్డును బ్రేక్ చేయడం కష్టమేనని పేర్కొన్నాడు. ఇది ప్రత్యేకమైన ఇన్నింగ్స్ అని కొనియాడాడు. టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు లారా(400) పేరిటే ఉంది.